Breaking News

తయారీలో సహకారంపై భారత్, సౌదీ చర్చలు

Published on Sun, 11/03/2024 - 05:44

న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధనం, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, తయారీ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంపై భారత్, సౌదీ అరేబియా దృష్టి పెడుతున్నాయి. రెండు రోజుల సౌదీ పర్యటన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్, ఆ దేశ మంత్రులతో ఈ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అలాగే, ఫ్యూచర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్షియేటివ్‌ కార్యక్రమంలో పాల్గొంటారని, పలువురు అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్లతో కూడా భేటీ అవుతారని వివరించింది. 

వ్యవసాయం, ఆహార భద్రత, ఇంధనం, టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తదితర రంగాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ ఇండియా–సౌదీ స్ట్రాటెజిక్‌ పార్ట్‌నర్‌íÙప్‌ కౌన్సిల్‌ కింద ఎకానమీ–ఇన్వెస్ట్‌మెంట్‌ కమిటీ రెండో సమావేశానికి కో–చెయిర్‌గా వ్యవహరిస్తారు. సౌదీ అరేబియాకు భారత్‌ రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారత్‌కు సౌదీ అరేబియా నాలుగో అతి పెద్ద భాగస్వామి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023–24లో 43 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఎల్‌అండ్‌టీ, టాటా, విప్రో తదితర దిగ్గజ భారతీయ కంపెనీలు సౌదీ అరేబియాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2000 ఏప్రిల్‌ నుంచి 2024 జూన్‌ మధ్య కాలంలో భారత్‌లో సౌదీ అరేబియా 3.22 బిలియన్‌ డాలర్ల మేర ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టింది.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)