Breaking News

భారత్‌ చేతికి మరిన్ని స్విస్‌ ఖాతాల వివరాలు

Published on Tue, 10/10/2023 - 04:30

న్యూఢిల్లీ/బెర్న్‌: వార్షిక ఆటోమేటిక్‌ సమాచార మారి్పడి (ఏఈఓఐ) ఒప్పందం ప్రకారం స్విస్‌ బ్యాంకుల్లోని ఖాతాదారుల వివరాలకు సంబంధించిన 5వ సెట్‌ను భారత్‌కు స్విట్జర్లాండ్‌ అందించింది. వీటిలో వందల కొద్దీ ఖాతాల వివరాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇందులో కొందరు వ్యక్తులు, కార్పొరేట్లు, ట్రస్టులకు చెందిన అకౌంట్లు అనేకం ఉన్నట్లు వివరించాయి. భారత్‌కు స్విట్జర్లాండ్‌ అందించిన వివరాల్లో ఖాతాదారు పేరు, చిరునామా, దేశం, ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబరు, ఖాతాల్లో బ్యాలెన్స్‌ మొదలైనవన్నీ ఉన్నట్లు పేర్కొన్నాయి. గత నెల సెపె్టంబర్‌లో సమాచార మారి్పడి చోటు చేసుకోగా తదుపరి విడత సెట్‌ను స్విట్జర్లాండ్‌ 2024 సెప్టెంబర్‌లో భారత్‌కు అందించాల్సి ఉంటుంది.

పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్‌ రిటర్నుల్లో తమ ఆర్థిక వివరాలన్నీ సక్రమంగా పొందుపర్చారా లేదా అనేది పరిశీలించేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయి. స్విస్‌ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకుని, పన్నులు ఎగ్గొడుతున్న కుబేరుల ఆటకట్టడానికి ఉద్దేశించిన ఏఈఓఐ కింద భారత్‌కు తొలిసారి 2019 సెపె్టంబర్‌లో మొదటి సెట్‌ వివరాలు లభించాయి. 

మరోవైపు, ఈ ఏడాది మొత్తం 104 దేశాలతో ఆర్థిక ఖాతాల వివరాల మారి్పడి జరిగినట్లు స్విట్జర్లాండ్‌ ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌టీఏ) తెలిపింది. 78 దేశాలతో సమాచారం ఇచి్చపుచ్చుకున్నట్లు పేర్కొంది. 25 దేశాల నుంచి తాము వివరాలు తీసుకున్నప్పటికీ ఆయా దేశాల గోప్యత ప్రమాణాలు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో లేనందున తాము తమ సమాచారమేమీ ఇవ్వలేదని వివరించింది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)