Breaking News

వృద్ధి అంచనా 7.1 శాతం నుంచి 7.5 శాతానికి అప్‌

Published on Thu, 08/01/2024 - 00:59

న్యూఢిల్లీ: భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధికి సంబంధించి ప్రస్తుత 7.1 శాతం అంచనాలను 7.5 శాతానికి పెంచుతున్నట్లు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఇండ్‌–రా) తాజా నివేదికలో పేర్కొంది. వినియోగ డిమాండ్‌ క్రిత అంచనాలకన్నా మెరుగ్గా ఉండడం తాజా నిర్ణయానికి కారణమని వివరించింది. 

ప్రభుత్వ మూలధన పెట్టుబడులు,  కార్పొరేట్లు, బ్యాంకుల చక్కటి బ్యాలెన్స్‌ షీట్లు,  ప్రారంభమైన ప్రైవేట్‌ కార్పొరేట్‌ మూలధన పెట్టుబడుల ప్రక్రియ, వృద్ధి ఊపందుకోవడం వంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్‌ మరింత ఊపునిస్తున్నట్లు విశ్లేíÙంచింది. వ్యవసాయ, గ్రామీణ వ్యయాలను బడ్జెట్‌ పెంచుతుందని, సూక్ష్మ లఘు చిన్న మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) రంగానికి రుణ మంజూరులను మెరుగుపరుస్తుందని ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. 

ఆర్‌బీఐ, అర్థిక సర్వే అంచనాలకన్నా అధికం.. 
2024–25 భారత్‌ జీడీపీ పురోగతిపై ఆర్‌బీఐ (7.2 శాతం), ఆర్థిక మంత్రిత్వశాఖ సర్వే (6.5 శాతం నుంచి 7 శాతం మధ్య) వృద్ధి అంచనాలకన్నా... ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ తాజా అంచనాలు అధికంగా (7.5 శాతం) ఉండడం గమనార్హం. సాధరణంకన్నా అధిక స్థాయిలో వర్షపాతం, తాజా బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు వంటి అంశాలు ఇచ్చే ఫలితాలు జీడీపీ వృద్ధిని ఊహించినదానికన్నా పెంచుతాయని ఇండ్‌రా అభిప్రాయపడింది. ఆహార ద్రవ్యోల్బణం ప్రమాదంగా కొనసాగుతున్నప్పటికీ మొత్తంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం 2023–24 కంటే, 2024–25లో తక్కువగా ఉంటుందని సంస్థ అంచనావేసింది. ఇది వాస్తవ వేతన వృద్ధికి తోడ్పడుతుందని పేర్కొంది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు