Breaking News

ఏఐలో ప్రయివేట్‌  పెట్టుబడులు గుడ్‌

Published on Sun, 04/06/2025 - 05:54

న్యూయార్క్‌: వర్ధమాన దేశాలలో ఏఐ ప్రయివేట్‌ పెట్టుబడులకు 2023లో చైనా రెండో ర్యాంకును దక్కించుకోగా.. భారత్‌ టాప్‌–10గా నిలిచినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రపంచ దేశాలలో ఏఐపై యూఎస్‌ అత్యధికంగా 67 బిలియన్‌ డాలర్ల ప్రయివేట్‌ పెట్టుబడులు వెచ్చించినట్లు వెల్లడించింది. గ్లోబల్‌ ఏఐ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఇది 70 శాతంకాగా.. తద్వారా యూఎస్‌ టాప్‌ ర్యాంకులో నిలిచినట్లు తెలియజేసింది. వర్ధమాన దేశాలలో చైనా 7.8 బిలియన్‌ డాలర్లు, భారత్‌ 1.4 బిలియన్‌ డాలర్ల ప్రయివేట్‌ పెట్టుబడులు కేటాయించినట్లు తెలియజేసింది. 

యూఎన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(యూఎన్‌సీటీఏడీ) విడుదల చేసిన టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ నివేదిక 2025లో ఈ వివరాలు తెలియజేసింది. 2033కల్లా ప్రపంచవ్యాప్తంగా ఏఐ మార్కెట్‌ విలువ 4.8 ట్రిలియన్‌ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. వెరసి డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు అభిప్రాయపడింది. అయితే ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యాలు కొన్ని ఆర్థిక వ్యవస్థలకే పరిమితమవుతున్నట్లు పేర్కొంది. ప్రధానంగా గ్లోబల్‌ ఆర్‌అండ్‌డీ కేటాయింపుల్లో యూఎస్, చైనా 40 శాతం వాటా ఆక్రమిస్తున్నట్లు వెల్లడించింది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి