Breaking News

పోస్టల్‌ బ్యాంకుల్లో ఇక ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్

Published on Sun, 08/03/2025 - 21:36

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుల్లో ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ సదుపాయం ప్రారంభమైంది. సామాన్య ప్రజలకు ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులకు బ్యాంకింగ్‌ను మరింత సురక్షితంగా, సమ్మిళితంగా, సౌకర్యవంతంగా చేయడానికి ఈ ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ సదుపాయాన్ని తీసుకొచ్చారు.

యూఐడీఏఐ (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఫ్రేమ్‌వర్క్ కింద అభివృద్ధి చేసిన ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ద్వారా ఖాతాదారులు ముఖ గుర్తింపును ఉపయోగించి బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఇకపై వేలిముద్రలు లేదా ఓటీపీల వంటి భౌతిక బయోమెట్రిక్ ఇన్‌పుట్‌ల అవసరం ఉండదు.

"ఐపీపీబీలో, బ్యాంకింగ్ అందుబాటులో ఉండటమే కాదు.. హుందాగా ఉండాలని మేము నమ్ముతున్నాం. ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్‌ ద్వారా బయోమెట్రిక్ వేలిముద్రలు లేదా ఓటీపీ ధృవీకరణలో పరిమితుల కారణంగా ఏ కస్టమర్ కూడా ఇబ్బంది పడకుండా చేస్తున్నాం. ఇది కేవలం టెక్ ఫీచర్ మాత్రమే కాదు. ఇది ఆర్థిక సమ్మిళితాన్ని పునర్నిర్వచించే దిశగా ఒక అడుగు" అని ఐపీపీబీ ఎండీ, సీఈవో ఆర్ విశ్వేశ్వరన్ పేర్కొన్నారు.

ఫేస్ ఆథెంటికేషన్ ఫీచర్ కీలక ప్రయోజనాలు

  • ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ సెన్సార్లపై ఆధారపడకుండా ఆధార్ ఆథెంటికేషన్ సురక్షితం

  • సులువైన కస్టమర్ అనుభవం కోసం వేగవంతమైన, కాంటాక్ట్ లెస్ లావాదేవీలు

  • ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సురక్షితమైన బ్యాంకింగ్

  • ఖాతా తెరవడం, బ్యాలెన్స్ విచారణ, ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లు, యుటిలిటీ చెల్లింపులతో సహా అన్ని బ్యాంకింగ్ సేవలకు మద్దతు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)