Breaking News

ఎగువ మధ్యాదాయ రేసులో 5 రాష్ట్రాలు!

Published on Tue, 07/07/2026 - 12:29

భారతదేశం స్థూలంగా తక్కువ మధ్య ఆదాయ (లోయర్‌ మిడిల్‌ ఇన్‌కమ్‌) ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నప్పటికీ దేశీయంగా కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆదాయంలో దూసుకుపోతున్నాయి. ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన దేశాల ఆర్థిక వర్గీకరణ గుర్తింపు, రాష్ట్రాల తలసరి ఆదాయ డేటాను విశ్లేషిస్తూ కొన్ని సంస్థలు అందించిన నివేదిక ప్రకారం.. భారతదేశంలోని ఐదు రాష్ట్రాలు ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ఎగువ మధ్య ఆదాయ (అప్పర్‌ మిడిల్‌ ఇన్‌కమ్‌) పరిమితిని దాటేశాయి.

మరోవైపు కొన్ని రాష్ట్రాలు ఈ మైలురాయికి అత్యంత సమీపంలో ఉండగా మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ పేదరికంలో వెనుకబడి ఉండటం దేశీయ ఆర్థిక అసమానతలను స్పష్టం చేస్తోంది.

గ్లోబల్ బెంచ్‌మార్క్‌ను దాటిన రాష్ట్రాలు

ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం, ఏ దేశం లేదా ప్రాంతం తలసరి ఆదాయమైనా 4,636 డాలర్ల నుంచి 14,375 డాలర్ల మధ్య ఉంటే దానిని ‘ఎగువ-మధ్య-ఆదాయ’ ఆర్థిక వ్యవస్థగా గుర్తిస్తారు. ఈ బెంచ్‌మార్క్‌ను అధిగమించి టాప్-5లో నిలిచిన భారతీయ రాష్ట్రాల వివరాలు..

స్థానంరాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతంతలసరి ఆదాయం (డాలర్లలో)
1ఢిల్లీ6,217
2కర్ణాటక5,579
3తెలంగాణ5,407
4తమిళనాడు5,329
5గుజరాత్4,734

అడుగు దూరంలో మరిన్ని రాష్ట్రాలు

మరికొద్దిపాటి వృద్ధిని నమోదు చేస్తే ‘ఎగువ-మధ్య-ఆదాయ’ హోదాను అందుకోవడానికి మరో మూడు రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో..

  • మహారాష్ట్ర: తలసరి ఆదాయం 4,628 డాలర్లు (బెంచ్‌మార్క్ కంటే కేవలం 8 డాలర్లు తక్కువ).

  • హరియాణా: తలసరి ఆదాయం 4,627 డాలర్లు (బెంచ్‌మార్క్ కంటే కేవలం 9 డాలర్లు తక్కువ).

  • కేరళ: తలసరి ఆదాయం 4,610 డాలర్లు (బెంచ్‌మార్క్ కంటే కేవలం 26 డాలర్లు తక్కువ).

ఒకవైపు కొన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ ప్రమాణాల వైపు దూసుకుపోతుంటే, మరోవైపు దేశంలో ప్రాంతీయ అసమానతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాల పరిస్థితి దయనీయంగా ఉంది. అందులో అట్టడుగున బిహార్‌ ఉంది. కేవలం 984 డాలర్లు తలసరి ఆదాయంతో బిహార్ భారతదేశంలోనే పేద రాష్ట్రంగా మిగిలిపోయింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ (1,403 డాలర్లు), ఝార్ఖండ్ (1,470 డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చదవండి: కలెక్టర్ల జీతభత్యాల మాటేంటి?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)