Breaking News

ఈయూకు పెరిగిన భారత డీజిల్‌ ఎగుమతులు

Published on Sat, 09/06/2025 - 14:56

భారత్‌ నుంచి యురోపియన్‌ యూనియన్‌(ఈయూ)కు చేసే చమురు ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏడాది ప్రాతిపదికన ఆగస్టు నెలలో 137 శాతం డీజిల​్‌ ఎగుమతులు పుంజుకున్నాయి. ఇవి రోజుకు సుమారు 2,42,000 బ్యారెల్స్(బీపీడీ)కు చేరుకున్నాయి. 2026 జనవరిలో రష్యన్ క్రూడాయిల్ నుంచి శుద్ధి చేసిన ఉత్పత్తులపై ఈయూ నిషేధం విధించడమే ఇలా దేశీయ డీజిల్‌ ఎగుమతులు పుంజుకోవడానికి కారణమని తెలుస్తుంది.

రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురుతో శుద్ధి చేసిన ఉత్పత్తులపై ఈయూ ఆంక్షలు విధించింది. ఇవి వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. దానికి ముందే యురోపియన్ కొనుగోలుదారులు ఇంధన సరఫరాలపై ప్రభావం పడకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగా ఇండియా వంటి దేశాల్లో రిఫైనరీ కంపెనీలతో శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను సరఫరా చేయాలనేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. దాంతో ఇండియాలో ఈయూకు చేసే డీజిల్ ఎగుమతులు పెరిగాయి.

భారత కంపెనీలకు ప్లస్‌

రష్యా ఎగుమతులపై ఈయూ, జీ7 దేశాలు ధరల పరిమితి, ముడిచమురు ఆంక్షలు విధించాయి. దాంతో భారతీయ రిఫైనరీలు డిస్కౌంట్ ధరలకు రష్యా ముడి చమురును దిగుమతి చేసుకొని, శుద్ధి చేయడం, చట్టబద్ధంగా డీజిల్, జెట్ ఇంధనాన్ని యూరప్‌కు తరలించడం పెరిగింది. భారతీయ రిఫైనరీలు ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ, ఎంఆర్‌పీఎల్‌ ఈ ఎగుమతులను పెంచడానికి డిస్కౌంట్ క్రూడ్‌ను భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి. 2024 మొదటి మూడు త్రైమాసికాల్లో ఈయూకు ఇంధన ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 58% పెరిగాయి.

రష్యా చమురుపై ఆంక్షలు ఎందుకు?

రష్యన్ క్రూడ్ నుంచి శుద్ధి చేసిన ఉత్పత్తుల తయారీపై ఈయూ ఆంక్షలు విధించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యాకు ఆదాయాన్ని తగ్గించేందుకు జీ7 దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఆంక్షలు 2026 జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. రవాణా, వ్యవసాయం, పరిశ్రమలకు డీజిల్ కీలకం. డీజిల్, డీజిల్ గ్రేడ్ క్రూడాయిల్ సరఫరాలో రష్యా అగ్రస్థానంలో ఉంది.

ఇదీ చదవండి: మన గోప్యత బజారుపాలు!

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)