ఎగుమతులు డీలా

Published on Tue, 11/18/2025 - 04:41

న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌లు మన దేశ ఎగుమతులపై అక్టోబర్‌లో చెప్పుకోతగ్గ ప్రభావమే చూపించాయి. వస్తు ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 11.8 శాతం తక్కువగా 34.38 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే నెలలో దిగుమతులు 16.63 శాతం అధికమై 76.06 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 

దీంతో వాణిజ్య లోటు 41.68 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లను అమలు చేస్తుండడం తెలిసిందే. సేవల ఎగుమతులు 38.52 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో సేవల ఎగుమతులు 34.41 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం.  

→ బంగారం దిగుమతులు 200 శాతం అధికమై 14.72 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2024 అక్టోబర్‌లో పసిడి దిగుమతుల విలువ 4.92 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు చూసినా బంగారం దిగుమతులు 21.44 శాతం పెరిగి 41.23 బివలియన్‌ డాలర్లకు చేరాయి. 

→ వెండి దిగుమతులు ఏకంగా 529 శాతం పెరిగి 2.71 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  

→ చమురు దిగుమతులు మాత్రం 14.8 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 2024 అక్టోబర్‌లో చమురు దిగుమతులు 18.9 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంటే చమురు దిగుమతుల స్థాయికి బంగారం దిగుమమతులు చేరినట్టు తెలుస్తోంది.  

→ ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాభరణాలు, అపారెల్స్, టెక్స్‌టైల్, ఆర్గానిక్, ఇనార్గానిక్‌ కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ప్లాస్టిక్‌ గూడ్స్‌ ఎగుమతులు చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గాయి. ఇక చేతి ఉత్పత్తులు, కార్పెట్, లెదర్, ఐరన్‌ఓర్, టీ, రైస్, పొగాకు, దినుసుల ఎగుమతులు మరింత క్షీణించాయి.   

→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ కాలంలో ఎగుమతులు 254.25 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 0.63 శాతం ఎక్కువ. ఇదే కాలంలో దిగుమతులు 6.37 శాతం పెరిగి 451.08 బిలియన్‌ డాలర్లకు చేరాయి. తొలి ఆరు నెలల్లో వస్తు వాణిజ్య లోటు 196.82 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  

మొత్తం దిగుమతుల్లో 5 శాతం 
బంగారం దిగుమతుల విలువ మొత్తం ఎగుమతుల్లో 5 శాతంగా ఉండడం గమనార్హం. అయితే, పసిడి దిగుమతులు భారీగా పెరగడానికి పండుగల సమయంలో డిమాండ్‌ కారణమని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేజ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. బంగారం దిగుమతుల్లో 40 శాతం స్విట్జర్లాండ్‌ నుంచి రాగా, యూఏఈ నుంచి 16 శాతం, దక్షిణాఫ్రికా నుంచి 10 శాతం చొప్పున దిగుమతైంది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)