200కు పైగా ఎయిర్‌పోర్ట్‌లు అవసరం

Published on Thu, 06/08/2023 - 06:33

న్యూఢిల్లీ: భారత్‌కు వచ్చే ఐదేళ్లలో 200కు మించి ఎయిర్‌పోర్ట్‌లు, హెలీపోర్ట్‌లు, వాటర్‌ ఏరోడ్రోమ్‌లు అవసరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఇదే కాలంలో ఎయిర్‌లైన్స్‌ సంస్థలు 1,400 విమానాల కోసం ఆర్డర్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. నరేంద్రమోదీ సర్కారు తొమ్మిదేళ్ల హయాంలో విమానయాన రంగం సాధించిన పురోగతిపై బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014 వరకు 74 ఎయిర్‌పోర్ట్‌లు, హెలీపోర్ట్‌లు, వాటర్‌పోర్ట్‌లే ఉండేవని, ఇవి రెట్టింపై ప్రస్తుతం 148కి చేరినట్టు చెప్పారు. ‘‘2013–14లో దేశీయంగా ఆరు కోట్ల మంది ప్రయాణించారు. ఇప్పుడు దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య 14.5 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో అంతర్జాతీయ ప్రయాణికులు 50 శాతం పెరిగి 4.7 కోట్ల నుంచి 7 కోట్లకు చేరారు. దేశ, విదేశీ కార్గో పరిమాణం ఇదే కాలంలో 2.2 మిలియన్‌ టన్నుల నుంచి 3.6 మిలియన్‌ టన్నులకు (65 శాతం అధికం) పెరిగింది. ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన ప్రగతిశీల విధానాల ఫలితంగా భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా అవతరించింది’’అని మంత్రి వివరించారు.

విమానాల సంఖ్య కూడా 2014 నాటికి 400గా ఉంటే, ఇప్పుడు 700కు చేరినట్టు చెప్పారు. ‘‘ఎయిర్‌ ఇండియా 70 బిలియన్‌ డాలర్ల విలువైన 470 విమానాలకు ఆర్డర్‌ ఇచ్చింది. ఇది కేవలం ఆరంభమే. భారత విమానయాన సంస్థలు రానున్న ఐదేళ్లలో 1,200 నుంచి 1,400 విమానాలకు ఆర్డర్‌ ఇవ్వనున్నాయి. రానున్న ఐదేళ్లలో ఎయిర్‌పోర్ట్‌ల రంగంలోకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయి’’అని సింధియా పేర్కొన్నారు. 2030 నాటికి దేశీయ ప్రయాణికుల సంఖ్య 45 కోట్లకు (వార్షికంగా) చేరుకుంటుందన్నారు. హెలీకాప్టర్‌ల వినియోగాన్ని ప్రోత్సాహిస్తామన్నారు. త్వరలోనే అంతర్జాతీయ ఉడాన్‌ ఫ్లయిట్‌ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు.  

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)