Breaking News

అధిక ఆర్థిక వృద్ధితోనే..

Published on Thu, 12/07/2023 - 05:08

న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన వనరులపై పెట్టుబడులు పెట్టడానికి భారతదేశం అధిక ఆర్థిక వృద్ధి రేటు సాధించాలి్పన అవసరం ఉందని  ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్‌ పేర్కొన్నారు.  బొగ్గు నుండి పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లేందుకు దేశానికి మరింత సమయం పడుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు.

ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, నేషనల్‌ డిటరై్మండ్‌ కాంట్రిబ్యూషన్స్‌ (ఎన్‌డీసీ) లక్ష్యాన్ని చేరుకోవడంలో భారతదేశం ఇతర జీ20 గ్రూప్‌ దేశాల కంటే చాలా ముందుందని అన్నారు. భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక పూర్వ (1985–1900) స్థాయిలతో పోలిస్తే  రెండు డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడానికి వివిధ దేశాలు అనుసరించిన జాతీయ కార్యాచరణ ప్రణాళికలను ఎన్‌డీసీలుగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే.  

పేద దేశాలకు ఇబ్బందే..
అయితే అసలే కోవిడ్‌ ప్రతికూల ప్రభావాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ, తక్కువ వృద్ధి సాధిస్తూ, అప్పుల వలయంలో ఉన్న కొన్ని దేశాలకు ఎన్‌డీసీ లక్ష్యాల సాధనకు పెట్టుబడులు పెట్టడం కష్టంగా మారిందని నాగేశ్వరన్‌ అన్నారు.  పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచుతామని కాప్‌28 వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో చేసిన డిక్లరేషన్‌పై సంతకాలు చేయడానికి ఈ నెల ప్రారంభంలో భారత్, చైనాలు తిరస్కరించిన సంగతి తెలిసిందే.  అయితే ఈ దిశలో అడుగులు వేయాలన్న జీ20 నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు భారత్‌ ఉద్ఘాటించింది.

పర్యావరణ పరిరక్షణపై దుబాయ్‌లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన చర్చల సందర్భంగా, 2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచడానికి కట్టుబడి ఉన్నట్లు 118 దేశాలు ఉద్ఘాటించాయి. ఈ ప్రతిష్టాత్మక సమావేశం ప్రపంచంలోని మొత్తం శక్తి ఉత్పత్తిలో శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. డిక్లరేషన్‌కు మద్దతు ఇచి్చన దేశాల్లో జపాన్, ఆ్రస్టేలియా, కెనడా, చిలీ, బ్రెజిల్, నైజీరియా,  బార్బడోస్‌ ఉన్నాయి. ఈ డిక్లరేషన్‌లో శిలాజ ఇంధనాల వినియోగం తగ్గడంతో పాటు పునరుత్పాదక ఇంధన ఉత్పత్లి పెంచడం కూడా కీలక అంశంగా ఉంది. నిరంతర బొగ్గు విద్యుత్‌ను దశలవారీగా తగ్గించాలని, కొత్త బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్ల నిధులకు స్వస్తి పలకాలని కాప్‌28 సదస్సు ప్రతినబూనింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)