Breaking News

భారత్‌ అగ్రరాజ్యం అవ్వాలంటే... 20 ఏళ్లలో 8 నుంచి 9 శాతం వృద్ధి అవశ్యం

Published on Sat, 09/09/2023 - 04:51

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నట్లు భారత్‌ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే వచ్చే 20 ఏళ్లలో 8–9 శాతం వృద్ధిని సాధించాల్సి ఉంటుందని డెలాయిట్‌ దక్షిణాసియా సీఈవో రోమల్‌ శెట్టి అన్నారు. పెట్టుబడులకు సంబంధించి ‘చైనా ప్లస్‌ వన్‌’ వ్యూహం (చైనాతో పాటు మరో దేశంలో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ఆలోచనలు) నుండి భారతదేశం ప్రయోజనం పొందగలదని ఆయన అన్నారు. భారత్‌ పెద్ద మార్కెట్‌ అని,  ఇక్కడ అందుబాటులో ఉన్నంత స్థాయి, కార్యకలాపాల పరిమాణాన్ని మరే ఇతర దేశం అందించలేదని అన్నారు. ఒక వార్తా సంస్థకు ఆయన ఇచి్చన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..

► అంతరిక్ష రంగం విషయానికి వస్తే, భారతదేశంలో ఇప్పటికే 200 స్టార్టప్‌లు ఉన్నాయి. 2040 నాటికి 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఈ రంగం ఆకర్షించే అవకాశం ఉంది.  
► అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారాలంటే కనీసం 2047 వరకు 8–9 శాతం వృద్ధిని సాధించాలి. మధ్య ఆదాయ స్థాయి పెరగడం, వేగంతో ఎదగడం అంత సులభం కాదు. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు ఏడాది ప్రాతిపదికన 8–9 శాతం వేగం వృద్ధిని నమోదుచేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.  
► వ్యవసాయం, అంతరిక్ష పరిశోధనలు,  సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్‌ వెహికిల్‌సహా ఇతర పురోగతి చెందుతున్న భారత్‌ రంగాల్లో  పెట్టుబడుల అవకాశాలను అన్వేíÙంచవచ్చు.  దేశం సంవత్సరానికి 16,000–18,000 కిలోమీటర్ల (వేగంతో)మేర రోడ్లను నిర్మిస్తోంది. ఇది మౌలిక రంగం పురోగతికి, ఆర్థికాభివృద్ధికి, వాణిజ్యాన్ని పెంపొందించడానికి దోహదపడే అంశం.  
► బహుళజాతి కంపెనీలు ’చైనా ప్లస్‌ వన్‌’ విధానం వైపు చూస్తున్నాయి. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కంపెనీలు తమ తయారీని చైనా కాకుండా వేరే చోటికి తరలించాలని నిర్ణయించినప్పుడు ప్రయోజనం పొందే ఇతర దేశాలు ఉన్నప్పటికీ భారత్‌ మినహా మరే ఇతర దేశానికి అంత స్థాయి, పరిమాణం లేదు.  
► ముడిచమురు దిగుమతుల బిల్లే భారత్‌ అతిపెద్ద సవాలు. సాంకేతికంగా దేశం పురోగమన పథంలో ఉన్నప్పటకీ.. కృత్రిమ మేధస్సు (ఏఐ)లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది.  
► ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ గత నెలలో ఒక నివేదిక విడుదల చేస్తూ,  భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత 3.4 ట్రిలియన్‌ డాలర్ల నుండి 2031 నాటికి 6.7 ట్రిలియన్‌ డాలర్లకు రెట్టింపు అవుతుందని అంచనా వేసింది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)