Breaking News

తుక్కు చేయడానికి ఎన్ని కేంద్రాలు అవసరమంటే..

Published on Tue, 12/19/2023 - 07:08

న్యూఢిల్లీ: దేశీయంగా 1,000 వాహన తుక్కు కేంద్రాలు, 400 ఆటోమేటెడ్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ సెంటర్లు అవసరమని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 85 స్క్రాపింగ్‌ సెంటర్లకు ప్రభుత్వం అనుమతిన్చినట్లు  ’డిజిఈఎల్‌వీ’ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన వివరించారు. 

జాతీయ వాహన స్క్రాపేజీ పాలసీ అనేది అన్ని వర్గాలకు ప్రయోజనకరమని, దక్షిణాసియాలో భారత్‌ స్క్రాపింగ్‌ హబ్‌గా ఎదిగేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. వాహన స్క్రాపింగ్‌ కోసం వాహనదారుకు స్క్రాపింగ్‌ కేంద్రం (ఆర్‌వీఎస్‌ఎఫ్‌) జారీ చేసిన సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్‌ (సీడీ)లను ట్రేడింగ్‌ చేసుకునేందుకు డిజిఈఎల్‌వీ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుంది. 

గత మూడు నెలలుగా బీటా ఫేజ్‌లో ఉన్న డిజిఈఎల్‌వీ దాదాపు 800 సర్టిఫికెట్ల ట్రేడింగ్‌కు తోడ్పడింది. పాతబడిన, ఫిట్‌నెస్‌ కోల్పోయిన, కాలుష్యకారక వాహనాలను దశలవారీగా తప్పించేందుకు 2021 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ వాహన స్క్రాపేజీ పాలసీని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం పాత వాహనాలను స్క్రాపింగ్‌ చేసిన వారు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే రోడ్‌ ట్యాక్స్‌లో పాతిక శాతం వరకు రిబేటు పొందవచ్చు. ఈ పాలసీ 2022 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)