Breaking News

అమెరికా టారిఫ్‌ బెదిరింపులకు లొంగకూడదు

Published on Fri, 08/29/2025 - 01:40

న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల బెదిరింపులకు భారత్‌ తలొగ్గరాదని ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ చెప్పారు. ఇలాంటి వాటికి ప్రజలంతా ఐక్యంగా ఎదురు నిలవాలని, దేశ గౌరవాన్ని కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. కంపెనీ 44వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా భార్గవ ఈ విషయాలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  దౌత్యపరమైన అంశాల్లో తొలిసారిగా టారిఫ్‌లను ప్రయోగించడం ద్వారా సంప్రదాయ విధానాలు, సంబంధాల విషయంలో దేశాలను పునరాలోచనలో పడేశారన్నారు.

ఇలాంటి తరుణంలో ప్రభుత్వానికి మద్దతుగా నిల్చి, దేశ పరువు ప్రతిష్టలను కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయులపై ఉందని భార్గవ తెలిపారు. అమెరికా మార్కెట్లో మన ఉత్పత్తులకు డిమాండ్‌ పడిపోయేలా, ట్రంప్‌ సర్కారు భారత ఎగుమతులపై సుంకాలను ఏకంగా 50 శాతానికి పెంచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, దేశీయంగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) విధానంలో సంస్కరణలు వేగవంతమైన వృద్ధికి, ఉద్యోగాల కల్పనకి దోహదపడుతుందని భార్గవ తెలిపారు. సంస్కరణలతో చిన్న కార్లపై జీఎస్‌టీ 18%కి తగ్గుతుందని ఆశిస్తున్నామని, అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుందని  పేర్కొన్నారు. ఇదే జరిగితే చిన్న కార్ల మార్కెట్‌ మళ్లీ పుంజుకోగలదని భార్గవ చెప్పారు. 

స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా చిన్న కార్లు.. 
దేశ జనాభాలో సింహభాగం ప్రజలు వ్యక్తిగత అవసరాల కోసం అత్యంత రిసు్కలతో కూడుకున్న ద్విచక్ర వాహనాలపైనే ఆధారపడుతుంటారని భార్గవ చెప్పారు. ఈ నేపథ్యంలో స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా ఉండే చిన్న కార్లను ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. 1950లలో ’కీయి’ కార్లను ప్రవేశపెట్టడం ద్వారా జపాన్‌ ఇలాంటి సమస్యను పరిష్కరించిందని తెలిపారు. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)