Breaking News

మొబైల్‌ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లు.. అధిక వాటా ఈ బ్రాండ్‌దే..

Published on Wed, 04/09/2025 - 08:26

గత ఆర్థిక సంవత్సరంలో మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు రూ.2 లక్షల కోట్ల మార్కును దాటాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఇందులో రూ.1.5 లక్షల కోట్ల వాటా యాపిల్‌ ఐఫోన్లదే ఉన్నట్లు వివరించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు 54 శాతం పెరిగినట్లు వివరించారు.

గత పదేళ్లలో దేశీయంగా ఎల్రక్టానిక్స్‌ తయారీ అయిదు రెట్లు, ఎగుమతులు ఆరు రెట్లు పెరిగినట్లు వైష్ణవ్‌ చెప్పారు. వివిధ పరికరాలు తయారు చేసే చిన్నా, పెద్ద సంస్థలన్నీ కలిపి 400 పైగా ప్రొడక్షన్‌ యూనిట్లు ఉన్నట్లు వివరించారు. ఎల్రక్టానిక్‌ కాంపోనెంట్‌ మాన్యుఫాక్చరింగ్‌ స్కీమ్‌ను ఆయన ఆవిష్కరించారు. దీని కింద ఏప్రిల్‌ 1 నుంచి ఆరేళ్ల పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయని వైష్ణవ్‌ తెలిపారు. టర్నోవరు ఆధారిత ప్రోత్సాహకాల లెక్కింపునకు 2024–25 ఆర్థిక సంవత్సరం బేస్‌ ఇయర్‌గా ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నాలుగు ఐపీవోలకు సెబీ ఓకే

కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్, మెడికల్‌ ఎల్రక్టానిక్స్, పవర్‌ ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్స్‌ తదితర ప్రతి టెక్నాలజీ ప్రోడక్టుల్లో ఉపయోగించే ఎల్రక్టానిక్‌ పరికరాలన్నింటికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. రెసిస్టర్లు, కెపాసిటర్లు, ఫెరైట్లు, స్పెషాలిటీ సెరామిక్స్, కాయిల్స్‌ మొదలైనవి ఈ జాబితాలో ఉంటాయి. టర్నోవరు ఆధారిత ప్రోత్సాహకాల కోసం కంపెనీలు రూ. 10 కోట్ల నుంచి రూ. 1,000 కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ప్రోత్సాహకాలు 1 నుంచి 10 శాతం వరకు ఉంటుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)