Breaking News

కొత్త విమానాలకు కీలక మార్కెట్‌గా భారత్‌.. 

Published on Wed, 06/07/2023 - 02:31

న్యూఢిల్లీ: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లకు భారత్‌ అత్యంత కీలక మార్కెట్‌గా మారనుందని బ్రోకరేజ్‌ సంస్థ బార్‌క్లేస్‌ ఒక నివేదికలో పేర్కొంది. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రాంతీయ కనెక్టివిటీ స్కీము ఉడాన్‌తో విమాన ప్రయాణాలు చేసే మధ్య తరగతి వర్గాల సంఖ్య పెరుగుతోందని వివరించింది. దీనితో పాటు మరికొన్ని సానుకూల అంశాలు భారత్‌ను కొత్త విమానాలకు కీలక కేంద్రంగా మారుస్తున్నాయని పేర్కొంది.

దేశీయంగా విమాన ప్రయాణాలకు సంబంధించి ప్రస్తుతం అమెరికా, చైనాల తర్వాత భారత్‌ మూడో అతి పెద్ద ఏవియేషన్‌ మార్కెట్‌గా ఉంది. ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ విషయంలో ప్రపంచంలోనే అత్యధికంగా వృద్ధి రేటు నమోదు చేస్తోంది. కొత్త విమానాలకు ఆర్డర్లివ్వడంలో అమెరికా తర్వాత భారతీయ విమానయాన సంస్థలు రెండో స్థానంలో ఉన్నాయి. బోయింగ్, ఎయిర్‌బస్‌ డెలివరీ చేసే వాటిల్లో 7 శాతం విమానాలను భారతీయ ఎయిర్‌లైన్స్‌ దక్కించుకుంటున్నాయి.

మార్కెట్‌ వాటాను పెంచుకునేందుకు ఇండిగో, ఆకాశ ఎయిర్‌ తదితర సంస్థలు పోటీపడనున్న నేపథ్యంలో విమానాల కొనుగోళ్ల నిర్ణయాలు ప్రాధాన్యతాంశంగా ఉండనున్నాయని బార్‌క్లేస్‌ తెలిపింది. దేశీయంగా తయారు చేసుకున్న కొమాక్‌ సీ919 విమానాలను చైనా పూర్తి స్థాయిలో వాడటం మొదలుపెడితే అక్కడి నుంచి ఆర్డర్లు తగ్గగలవని పేర్కొంది. అదే సమయంలో భారత మార్కెట్లో ఆర్డర్లు దక్కించుకుంటే సుదీర్ఘకాలం పాటు పని లభించగలదని వివరించింది. 

ఏటా 11 శాతం ట్రాఫిక్‌ వృద్ధి.. 
‘అంతర్జాతీయ ఏరోస్పేస్, డిఫెన్స్‌ పరిశ్రమ భారత మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి పెట్టనున్నాయి. 2006–2019 మధ్య కాలంలో భారత్‌లో దేశీ ట్రాఫిక్‌ వార్షికంగా 11 శాతం వృద్ధి చెందింది. దీర్ఘకాలంలో అంతర్జాతీయ సగటుకన్నా 200 బేసిస్‌ పాయింట్లు అధికంగా ఉండవచ్చని అంచనా.

2009–22 మధ్య కాలంలో భారత ఎయిర్‌లైన్స్‌ 1,400 పైచిలుకు ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్లు ఇచ్చాయి‘ అని బార్‌క్లేస్‌ వివరించింది. జీటీఎఫ్, లీప్‌ ఇంజిన్లు బిగించిన వాటిల్లో (ఏ320నియో, మ్యాక్స్‌ ఏరోప్లేన్లు) 10 శాతం విమానాలకు భారత్‌ కేంద్రంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ ఏరోస్పేస్‌ పరిశ్రమ ఆర్థిక పనితీరుకు కూడా భారత్‌ కీలకంగా ఉండనుందని వివరించింది.

ఎయిర్‌బస్‌కు సానుకూలం.. 
భారత ఎయిర్‌లైన్స్‌ ఎక్కువగా చిన్న (నారో బాడీ) విమానాల వైపు మొగ్గు చూపుతున్నాయి కనుక బోయింగ్‌తో పోలిస్తే ఎయిర్‌బస్‌కు పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోందని బార్‌క్లేస్‌ తెలిపింది. 2009 నుంచి చూస్తే దేశీ విమానయాన సంస్థలు ఇచ్చిన ఆర్డర్లలో 65 శాతం వాటా ఎయిర్‌బస్‌దే ఉన్నట్లు వివరించింది.

మరోవైపు, డిఫెన్స్‌ విషయానికొస్తే 81.4 బిలియన్‌ డాలర్ల కేటాయింపులతో అమెరికా, చైనా, రష్యా తర్వాత భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. సౌదీ అరేబియా తర్వాత అత్యధికంగా రక్షణ పరికరాలను దిగుమతి చేసుకుంటోంది.2018–22 మధ్య కాలంలో ప్రపంచ దేశాల మిలిటరీ పరికరాల దిగుమతుల్లో భారత్‌ వాటా 11 శాతంగా ఉంది.

అటు చైనా తమ మిలిటరీపై వ్యయాలను పెంచుకుంటున్నందున డిఫెన్స్‌కు భారత్‌ కేటాయింపులు కూడా అధిక స్థాయుల్లోనే కొనసాగవచ్చని బార్‌క్లేస్‌ తెలిపింది. భారతీయ మిలిటరీ పరికరాల విశ్లేషణ బట్టి చూస్తే భారతీయ వైమానిక దళానికి మరిన్ని ఫైటర్‌ జెట్ల అవసరం ఉన్నట్లుగా తెలుస్తోందని వివరించింది.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)