Breaking News

మెటాకు కీలక మార్కెట్‌గా భారత్‌

Published on Mon, 09/16/2024 - 07:45

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా తమకు కీలకమైన మార్కెట్లలో భారత్‌ కూడా ఒకటని సోషల్‌ మీడియా దిగ్గజం మెటా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ సంధ్య దేవనాథన్‌ తెలిపారు. దేశీయంగా రీల్స్, ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) సాధనాలకు గణనీయంగా ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు.

కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తి రీల్స్‌కి ఉందని గుర్తించిన బ్రాండ్లు, కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు తమ ప్రచార కార్యక్రమాల్లో వాటిని తొలినాళ్ల నుంచే వినియోగించడం ప్రారంభించాయని సంధ్య చెప్పారు. పేరెంటింగ్‌ టిప్స్‌ నుంచి ఓనమ్‌ వరకు వివిధ అంశాల గురించి సమాచారం కోసం భారతీయ యూజర్లు ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ వైపు మళ్లుతున్నారని వివరించారు.

ఈ నేపథ్యంలో దేశీయంగా వ్యాపారావకాశాలు పుష్కలంగా ఉన్నాయని, మరింతగా పెట్టుబడులు పెట్టడాన్ని కంపెనీ కొనసాగిస్తుందని ఆమె చెప్పారు. జెన్‌ జడ్, యువ జనాభా, ప్రైవేట్‌ రంగం పుంజుకోవడం, పటిష్టమైన వృద్ధి అవకాశాలు, నవకల్పనలు, స్టార్టప్‌ వ్యవస్థ, పటిష్టమైన క్యాపిటల్‌ మార్కెట్లు మొదలైనవి భారత మార్కెట్‌కి సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.

పరిశ్రమ వర్గాల్లోనూ ఆశాభావం నెలకొందని సంధ్య వివరించారు. ఇవన్నీ కూడా భారత్‌ ఒక ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న దాఖలాలను సూచిస్తున్నాయన్నారు. వాస్తవానికి చాలాకాలం క్రితమే దేశానికి ఈ హోదా దక్కాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు.   

#

Tags : 1

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు