Breaking News

దక్షిణాదిలో జీసీసీల జోరు 

Published on Tue, 07/22/2025 - 05:09

న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) అత్యధిక వాటా దక్షిణాది నగరాలదే ఉంటోంది. మొత్తం జీసీసీల్లో 55 శాతం సెంటర్లు (992) బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలోనే ఉన్నాయి. అమెరికాకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ వెస్టియన్‌ నివేదిక ప్రకారం భారత్‌లో సుమారు 1,700 జీసీసీలు ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉన్నాయి.
 ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3,200 పైగా జీసీసీల్లో ఇవి దాదాపు 53 శాతం. ఇతర దేశాలతో పోలిస్తే వ్యయాలు తక్కువగా ఉండటం, సుశిక్షితులైన నిపుణుల లభ్యత, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, పురోగామి పాలసీలు, వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులు మొదలైనవి జీసీసీల ఏర్పాటు సానుకూలాంశాలుగా ఉంటున్నాయని వెస్టియన్‌ సీఈవో శ్రీనివాస్‌ రావు తెలిపారు. ఏ జీసీసీ అయినా దీర్ఘకాలికంగా రాణించాలంటే సరైన ప్రాంతాన్ని ఎంచుకోవడం చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు.  

నివేదిక ప్రకారం.. 
→ దేశీయంగా ఉన్న మొత్తం జీసీసీల్లో 94 శాతం సెంటర్లు టాప్‌ నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, పుణెలోనే ఉన్నాయి.  
→ మొత్తం జీసీసీల్లో 50 శాతం వాటా ఐటీ–ఐటీఈఎస్‌ రంగానిది ఉండగా, 17 శాతం వాటాతో బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, బీమా) తర్వాత స్థానంలో ఉంది. 
→ నగరాలవారీగా చూస్తే బెంగళూరులో 487 జీసీసీలు ఉన్నాయి. ఇది మొత్తం సెంటర్స్‌లో 29 శాతం. 
→ హైదరాబాద్‌లో 273, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 272, ముంబైలో 207, పుణెలో 178, చెన్నైలో 162 గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు ఉన్నాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)