Breaking News

యూఎస్‌కు భారతీయ బొమ్మలు

Published on Thu, 04/13/2023 - 04:07

ప్యారిస్‌: భారత్‌లో తయారైన బొమ్మలను దిగుమతి చేసుకునేందుకు యూఎస్, యూరప్‌కు చెందిన దిగ్గజ కంపెనీలు  ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ సంస్థలు పెద్ద ఎత్తున బొమ్మలను కొనుగోలు చేసి ఆయా దేశాల్లో విక్రయించాలని భావిస్తున్నాయని ప్రభుత్వ అధికారుల సమాచారం. అంతేకాదు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తయారీ చేపట్టేందుకు వీలుగా ఇక్కడి కంపెనీలకు సాయం అందించేందుకూ ముందుకు రానున్నాయి. దేశీయంగా బొమ్మల తయారీని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్న డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ, ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ).. ఎగుమతులను పెంచడానికి విదేశీ కంపెనీలతో భాగస్వామ్యానికి కూడా సహాయం చేస్తోంది.

డీపీఐఐటీ తోడ్పాటు..
బొమ్మల కొనుగోలుకై ఇటీవలే యూఎస్‌కు చెందిన ప్రముఖ రిటైల్‌ కంపెనీ ఒకటి ఇక్కడి పరిశ్రమను సంప్రదించిందని ప్లేగ్రో టాయ్స్‌ ప్రమోటర్, టాయ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ మను గుప్తా తెలిపారు. రూ.3,280 కోట్ల విలువైన రైడ్‌ ఆన్, ఔట్‌డోర్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ టాయ్స్‌ను దిగుమతి చేసుకునేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. అలాగే ఇటలీ కంపెనీ సైతం ఆసక్తి చూపుతోందని వెల్లడించారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలతో భాగస్వామ్యానికి, ఆర్డర్లు పొందేందుకు ఇక్కడి కంపెనీలకు డీపీఐఐటీ తోడ్పాటు అందిస్తోందని వివరించారు. భారత కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు నైపుణ్యం మెరుగుపరిచేందుకు విదేశీ కంపెనీలు చేయి అందించనున్నాయని తెలిపారు. విదేశీ సంస్థలతో చేతులు కలిపేందుకు 82 భారతీయ కంపెనీలు అడుగు ముందుకు వేశాయన్నారు.  

ఎగుమతులు ఇలా..
భారత్‌ నుంచి 2022–23 ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలంలో రూ.1,017 కోట్ల విలువైన ఆట వస్తువులు ఎగుమతి అయ్యాయి. 2021–22లో వీటి విలువ రూ.2,601 కోట్లు. 2013–14 ఏప్రిల్‌–డిసెంబర్‌లో ఇక్కడి నుంచి విదేశాలకు చేరిన బొమ్మల విలువ కేవలం రూ.167 కోట్లు మాత్రమే. విదేశాల నుంచి భారత్‌కు దిగుమతైన బొమ్మల విలువ 70 శాతం క్షీణించి 2021–22లో రూ.870 కోట్లుగా ఉంది. 20 శాతంగా ఉన్న దిగుమతి సుంకం 2020 ఫిబ్రవరిలో 60 శాతానికి చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దిగుమతి సుంకం 70 శాతం ఉంది. దిగుమతులను నిరుత్సాహపర్చడం, దేశీయంగా తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని బొమ్మల తయారీకి వర్తింపజేయాలని కేంద్రం భావిస్తోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)