భారత్‌లో అద్భుత అవకాశాలు

Published on Sun, 12/08/2024 - 03:52

వాషింగ్టన్‌: అమెరికా ఇన్వెస్టర్లకు భారత్‌ అసాధారణ రీతిలో అవకాశాలు కల్పిస్తోందని ఐఎంఎఫ్‌లో భారత ఈడీగా పనిచేస్తున్న కేవీ సుబ్రమణియన్‌ అన్నారు. వచ్చే 20–25 ఏళ్లలో ఈ స్థాయి రాబడులు మరే ఆర్థిక వ్యవస్థ కల్పించలేదన్నారు. తాను రాసిన ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్‌వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రెట్టింపు కాకుండా మూడింతలు చేయాలని సూచించారు. 

వారి పెట్టుబడులు 15–20 రెట్లు వృద్ధి చెందుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఇండియా @100: భవిష్యత్‌ ఆర్థిక శక్తిని ఊహించడం’ పేరుతో సుబ్రమణియన్‌ రచించిన ఈ పుస్తకంలో.. భారత్‌ 100వ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకునే 2047 నాటికి, 25 ఏళ్లలోపే 55 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎలా అవతరించగలదన్నది వివరించారు. 2014 తర్వాత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు, బలమైన విధానాలను ప్రవేశపెట్టడాన్ని ప్రస్తావించారు. కేవీ సుబ్రమణియన్‌ ప్రస్తుత పదవికి పూర్తం భారత మఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేయడం గమనార్హం.  

భారత్‌లో వేతన వృద్ధి ఎక్కువ.. 
భారత బ్యాంక్‌ ఖాతాల్లో పొదుపు చేసుకుంటే అమెరికా బ్యాంకుల కంటే ఎక్కువ రాబడి వస్తుందని భారత సంతతి వారికి సుబ్రమణియన్‌ సూచించారు. అమెరికాలో కంటే భారత్‌లో వేతన వృద్ధి ఎక్కువగా ఉంటుందన్నారు. ‘‘డాలర్ల రూపంలో 12 శాతం వృద్ధి ఉంటే, భారత్‌లో 17–18 శాతం మేర వృద్ధి చెందనుంది. అంటే ప్రతి ఐదేళ్లకు వేతనం రెట్టింపు అవుతుంది. 30 ఏళ్ల కెరీర్‌లో ఏడు వేతన రెట్టింపులు చూడొచ్చు. అంటే 100 రెట్ల వృద్ధి. అదే యూఎస్‌లో అయితే గరిష్టంగా ఏడెనిమిది రెట్ల వృద్ధే ఉంటుంది’’అని వివరించారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 55 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ధృడమైన విశ్వాసం వ్యక్తం చేశారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)