దేశ ప్రగతి కొన్ని కంపెనీలపైనే ఆధారపడరాదు

Published on Sun, 11/03/2024 - 05:25

ముంబై: దేశ అభివృద్ధి అన్నది కేవలం కొన్ని కంపెనీలు లేదా కొన్ని గ్రూపులపైనే ఆధారపడి ఉండరాదని ప్రముఖ బ్యాంకర్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ కోటక్‌ అభిప్రాయపడ్డారు. దేశమంతటా మరిన్ని కంపెనీలు వృద్ధి చెందేలా విస్తృతంగా ఉండాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థూలంగా చూస్తే ఆశావహంగానే కనిపించినా.. సూక్ష్మంగా చూస్తే కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఉదయ్‌ కోటక్‌ పేర్కొన్నారు. 

బారత కంపెనీలు రక్షణాత్మక ధోరణి కంటే పోటీతత్వంపైనే ఎక్కువ దృష్టి సారించాలని కోరారు. దీపావళి సందర్భంగా ఇన్వెస్టర్లకు ఉదయ్‌ కోటక్‌ ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు. కంపెనీలకు సాయం చేయడం ద్వారా ‘వెయ్యి పువ్వులు వికసించనివ్వండి’ అనే సామెతను ఆచరణ దాల్చేలా క్యాపిటల్‌ మార్కెట్లు చూడాలన్నారు. 

గతేడాది ఈక్విటీలు, ఫైనాన్షియల్‌ మార్కెట్లకు గొప్ప సంవత్సరంగా ఉండిపోతుందంటూ, ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడులు వచి్చనట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ ఉద్ధాన పతనాలకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు క్షీణిస్తుండడంతో అప్రమత్తతో కూడిన ఆశావహ ధోరణితో ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నాయంటూ, వీటిపై భారత్‌ ఓ కన్నేసి ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థికవేత్త అరవింద్‌ సుబ్రమణియన్‌ సైతం కేవలం కొన్ని గ్రూపులే కార్పొరేట్‌ రంగాన్ని నడిపిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)