Breaking News

జీడీపీ వృద్ధి 6.5 శాతం 

Published on Wed, 09/24/2025 - 05:33

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) భారత జీడీపీ 6.5% వృద్ధి రేటు నమోదు చేస్తుందన్న గత అంచనాలను కొనసాగిస్తున్నట్టు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ (అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ) ప్రకటించింది. వర్షాలు సమృద్ధిగా పడడం, ఆదాయపన్ను, జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో దేశీ వినియోగం బలంగా ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ పెట్టుబడులు సైతం పెరుగుతాయని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో 3.2 శాతానికి పరిమితం అవుతుందని, దీంతో ఆర్‌బీఐ మరో విడత పావు శాతం మేర రెపో రేటును తగ్గించొచ్చని తన తాజా నివేదికలో పేర్కొంది.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. అంచనాలకు మించి ఆహార ధరలు తగ్గడం.. ప్రస్తుత ఏడాదిలో ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలోనే కొనసాగేందుకు మద్దతుగా ఉంటుందని తెలిపింది. ఇది తదుపరి రేట్ల కోతకు వెసులుబాటునిస్తుందని అభిప్రాయపడింది. ఆసియా దేశాల ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌లు.. వాటి ఎగుమతులు, ప్రాంతీయ సరఫరా పరిస్థితులపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. ‘‘యూఎస్‌ టారిఫ్‌లపై జూన్‌లో వేసిన మా అంచనాల తర్వాత పరిణామాలను గమనిస్తే.. ఇప్పటి వరకు ఇతర దేశాల కంటే చైనా మెరుగ్గా వ్యవహరించింది. ఆగ్నేయాసియా అభివృద్ధి మార్కెట్లపై ప్రభావం పడగా, భారత్‌పై ఇది మరింత ఎక్కువగా ఉంది’’ అని ఎస్‌అండ్‌పీ వివరించింది.   

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)