Breaking News

జీడీపీపై టారిఫ్‌ ఎఫెక్ట్‌!!

Published on Sat, 08/09/2025 - 05:15

న్యూఢిల్లీ: అమెరికా ఆగస్టు 27 నుంచి 50 శాతం టారిఫ్‌లను అమలు చేస్తే భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)పై ప్రభావం పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 బేసిస్‌ పాయింట్లు నెమ్మదించి 6 శాతానికి పరిమితం కావొచ్చని మూడీస్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. అయితే, దేశీయంగా డిమాండ్‌ మెరుగ్గా ఉండటం, సరీ్వసుల రంగం పటిష్టంగా ఉండటం వంటి అంశాలు భారత్‌పై ఒత్తిడిని తగ్గిస్తాయని పేర్కొంది. భారీ అమెరికా టారిఫ్‌లపై భారత్‌ స్పందించే తీరే అంతిమంగా వృద్ధి రేటు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని వివరించింది. 

‘భారత్‌ ఎగుమతులకు అమెరికా అతి పెద్ద గమ్యస్థానంగా ఉంటోంది. అలాంటప్పుడు అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరిస్తున్నా, రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడాన్ని కొనసాగిస్తే 2025–26లో భారత జీడీపీ వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 6.3 శాతంతో పోలిస్తే 30 బేసిస్‌ పాయింట్లు (0.3 శాతం) మేర నెమ్మదించవచ్చు‘ అని మూడీస్‌ పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను భారత్‌పై అమెరికా టారిఫ్‌లను రెట్టింపు చేసి 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ కొత్త టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం 191 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్‌ డాలర్లకు పెంచుకునే లక్ష్యంతో ఇరు దేశాలు మార్చి నుంచి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి.  

ఆసియా–పసిఫిక్‌ దేశాలతో పోటీ.. 
అమెరికా విధానాల్లో మార్పుల వల్ల సరఫరా సిస్టంలు పునర్‌వ్యవస్థీకరణకు లోనవుతున్న నేపథ్యంలో వాణిజ్యం, పెట్టుబడుల్లో మరింత వాటా కోసం ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలోని పలు దేశాలు పోటీపడుతున్నాయని తెలిపింది.2025 తర్వాత మిగతా ఆసియా–పసిఫిక్‌ దేశాలతో పోలిస్తే టారిఫ్‌ల అంతరాలు భారీగా పెరిగిపోవడం వల్ల తయారీ రంగ హబ్‌గా ఎదగాలన్న భారత ఆకాంక్షలకు గండి పడొచ్చని మూడీస్‌ పేర్కొంది. అంతేగాకుండా ఇటీవలి కాలంలో పెట్టుబడుల రూపంలో ఒనగూరిన కొన్ని ప్రయోజనాలు కూడా వెనక్కి తరలిపోవచ్చని తెలిపింది. అయితే, అంతర్జాతీయ ఒడుదుడుకులను ఎదుర్కొనడానికి భారత్‌ వద్ద ప్రస్తుతం తగినంత విదేశీ మారక నిల్వలు ఉన్నాయని వివరించింది.  
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)