రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..
Breaking News
సీజేపీ నేతలకు మరోసారి షాక్
పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల
టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ
టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
96 చోట్ల హింసాత్మక ఘటనలు: లేళ్ల అప్పిరెడ్డి
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్‌లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బరితెగించిన పచ్చమూకలు.. వంతపాడిన పోలీసులు!
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
Saudi: భారత పౌరులకు భద్రతా హెచ్చరికలు
ఫారెక్స్.. ‘డౌన్’ టర్న్
Published on Sat, 02/11/2023 - 10:45
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు (ఫారెక్స్) మూడు వారాల అప్‌ట్రెండ్ తర్వాత మళ్లీ దిగువముఖంగా పయనించాయి. ఫిబ్రవరి 3వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 1.49 బిలియన్ డాలర్లు తగ్గి, 575.267 బిలియన్ డాలర్లకు చేరాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి.
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ పడిపోకుండా చూసే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ భారీగా డాలర్లు వ్యయం చేయడంతో గరిష్ట స్థాయి నుంచి 100 బిలియన్ డాలర్లుకుపైగా పడిపోయాయి. అయితే ఫిబ్రవరి 3కు ముందు వారానికి ముందు 21 రోజల్లో పురోగతి బాటన పయనించాయి. విభాగాల వారీగా చూస్తే..
- డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఫిబ్రవరి 3వ తేదీతో ముగిసిన వారంలో 1.3 బిలియన్ డాలర్లు తగ్గి, 508 బిలియన్ డాలర్లకు చేరాయి.
- పసిడి నిల్వలు 246 మిలియన్ డాలర్లు తగ్గి 43.781 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
- అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) 66 మిలియన్ డాలర్లు పెరిగి, 18.544 బిలియన్ డాలర్లకు చేరింది.
- ఇక ఐఎంఎఫ్ వద్ద భారత్ రిజర్వ్స్ పరిస్థితి 9 మిలియన్ డాలర్లు పెరిగి, 5.247 బిలియన్ డాలర్లకు చేరింది.
#
Tags : 1