Breaking News

ద్రవ్యలోటు నియంత్రణలోనే..

Published on Sat, 11/01/2025 - 08:49

కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) రూ.5,73,123 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2025–26) జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతంగా (రూ.15.69 లక్షల కోట్లు) ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొనడం గమనార్హం. ఈ ప్రకారం చూస్తే మొత్తం లక్ష్యంలో ద్రవ్యలోటు 36.5 శాతానికి చేరినట్టు తెలుస్తోంది.

సరిగ్గా క్రితం ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో 29 శాతంగానే ఉండడం గమనించొచ్చు. ఏప్రిల్‌–సెపె్టంబర్‌ మధ్య రూ.12.29 లక్షల కోట్ల ఆదాయం పన్ను రూపంలో ప్రభుత్వానికి వచి్చంది. రూ.4.66 లక్షల కోట్లు పన్నేతర ఆదాయం కాగా, రూ.34,770 కోట్లు రుణేతర మూలధనం రూపంలో సమకూరింది. ఇందులో రూ.6.31 లక్షల కోట్లను రాష్ట్రాలకు (పన్నుల వాటా కింద) కేంద్రం బదిలీ చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే రూ.86,948 కోట్లు అధికంగా బదిలీ అయింది. మొత్తం వ్యయం రూ.23 లక్షల కోట్లుగా ఉంది. రెవెన్యూ వ్యయాల్లో రూ.5.78 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులకు ఖర్చు కాగా, రూ.2.02 లక్షల కోట్లు సబ్సిడీలపై వెచి్చంచింది. ప్రభుత్వ మూలధన వ్యయం 40% పెరగడాన్ని (రూ.5.7 లక్షల కోట్లు) ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్‌ స్వాగతించారు.

ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్‌ ఐడియాలు
 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు