Breaking News

హైడ్రోజన్‌ రైలుకు స్పందన కరువు!?

Published on Wed, 07/22/2026 - 18:45

భారతీయ రైల్వే హరిత రవాణా దిశగా కీలక అడుగు వేస్తూ దేశంలో తొలి స్వదేశీ హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ రైలును హర్యానాలోని జింద్‌–సోనిపట్‌ మార్గంలో ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 17న ఈ రైలును ప్రారంభించారు. 10 కోచ్‌లతో రూపొందించిన ఈ రైలు ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ఇది భారతదేశానికే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్‌ రైలు సెట్‌లలో ఒకటిగా నిలిచింది.

అత్యాధునిక సౌకర్యాలు, కేవలం రూ.5 నుంచి రూ.25 మధ్యే టికెట్‌ ఛార్జీలు ఉన్నప్పటికీ ప్రారంభ రోజుల్లో ప్రయాణికుల స్పందన ఆశించిన స్థాయిలో కనిపించలేదు. తొలి రోజు జింద్‌ నుంచి బయలుదేరిన రైలులో సాధారణ ప్రయాణికులు సుమారు 20 మంది మాత్రమే ప్రయాణించగా, రెండో రోజూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగినట్లు స్థానిక నివేదికలు పేర్కొంటున్నాయి.

ఎందుకు తక్కువ మంది ప్రయాణిస్తున్నారు?

రైల్వే వర్గాల అంచనా ప్రకారం, జింద్‌–సోనిపట్‌ మార్గంలో ఇప్పటికే పలు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అందుబాటులో ఉండటంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయాల కొరత లేదు. కొత్త హైడ్రోజన్‌ రైలు గురించి ఇంకా చాలామందికి పూర్తి అవగాహన లేకపోవడం కూడా మరో కారణంగా భావిస్తున్నారు. ప్రచారం పెరిగి, ప్రజల్లో విశ్వాసం ఏర్పడిన తర్వాత ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

హైడ్రోజన్‌ రైలు ఎలా పనిచేస్తుంది?

సాంప్రదాయ డీజిల్‌ ఇంజిన్‌కు బదులుగా ఈ రైలు హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ సాంకేతికతను ఉపయోగిస్తుంది. హైడ్రోజన్‌, గాలిలోని ఆక్సిజన్‌ మధ్య జరిగే రసాయనిక చర్య ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసి మోటార్లను నడుపుతుంది. ఈ ప్రక్రియలో పొగ లేదా కార్బన్‌ ఉద్గారాలు వెలువడవు. ఉప ఉత్పత్తిగా నీటి ఆవిరి మాత్రమే విడుదల కావడంతో ఇది పర్యావరణహిత రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందింది.

ప్రత్యేకతలు ఇవే..

🔹 10 కోచ్‌లతో సుమారు 2,600 మంది ప్రయాణికుల సామర్థ్యం.
🔹 మెట్రో తరహా ఆటోమేటిక్‌ డోర్లు.
🔹 డిజిటల్‌ ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ డిస్‌ప్లేలు.
🔹 పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ వ్యవస్థ.
🔹 హైడ్రోజన్‌ లీకేజ్‌, మ​​ంటలు, ఉష్ణోగ్రతలను గుర్తించే బహుళ భద్రతా వ్యవస్థలు.
🔹 జింద్‌లో ప్రత్యేక హైడ్రోజన్‌ నిల్వ, రీఫ్యూయలింగ్‌ మౌలిక సదుపాయాలు.
🔹 గరిష్ఠ డిజైన్‌ వేగం గంటకు 110 కి.మీ.( ప్రస్తుతం ఈ మార్గంలో గంటకు 75 కి.మీ. వేగంతో నడుస్తోంది)

హైడ్రోజన్‌ ఆధారిత రైలు సేవలను ప్రారంభించిన దేశాల జాబితాలో భారత్‌ కూడా చేరింది. భవిష్యత్తులో పూర్తిగా విద్యుదీకరణ సాధ్యం కాని మార్గాలు, పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో ఇలాంటి రైళ్ల వినియోగాన్ని విస్తరించే దిశగా భారతీయ రైల్వేలు ఈ ప్రాజెక్టును పైలట్‌గా ఉపయోగించనున్నాయి.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)