Breaking News

ఎగుమతుల జోరు

Published on Tue, 12/16/2025 - 04:18

న్యూఢిల్లీ: ఎగుమతుల రంగం నవంబర్‌లో బలమైన పనితీరు చూపించింది. అమెరికా టారిఫ్‌ల నడుమ సానుకూల వృద్ధి నమోదైంది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం నవంబర్‌లో 38.13 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తు ఎగుమతులు జరిగాయి. ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ గూడ్స్, కెమికల్స్, రత్నాభరణాలు వృద్ధికి తోడ్పడ్డాయి. దిగుమతులు 1.88 శాతం తగ్గి 62.66 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ప్రధానంగా బంగారం, ముడిచమురు దిగుమతులు గణనీయంగా తగ్గాయి. 

దీంతో వాణిజ్య లోటు 24.53 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. ఐదు నెలల కనిష్ట స్థాయికి దిగివచ్చింది. అక్టోబర్‌ నెలకు వాణిజ్య లోటు 41.68 బిలియన్‌ డాలర్లతో పోల్చి చూసినా నవంబర్‌లో గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 2.62 శాతం పెరిగి 292.07 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు సైతం ఇదే కాలంలో 5.59 శాతం అధికమై 515.21 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 223.14 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  

→ నవంబర్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 11.65 శాతం పెరిగి 3.93 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  
→ టీ, కాఫీ, ఐరన్‌ ఓర్, జీడిపప్పు, డెయిరీ, హస్తకళాకృతులు, సముద్ర ఉత్పత్తులు, తోలు ఉత్పత్తుల ఎగుమతులు సైతం సానుకూలంగా నమోదయ్యాయి.  
→ బియ్యం, నూనె గింజలు, కార్పెట్, ప్లాస్టిక్స్‌ ఎగుమతులు క్షీణించాయి.  
→ సేవల ఎగుమతులు నవంబర్‌లో 35.86 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 2024 నవంబర్‌లో వీటి ఎగుమతులు 32.11 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు సేవల ఎగుమతులు 270 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి 248.56 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  

ఎగుమతులకు ప్రోత్సాహకం.. 
రూ. 25,060 కోట్లతో ఎగుమతుల ప్రోత్సాహక మిషన్‌కు సంబంధించి సవివర మార్గదర్శకాలను ఖరారు చేస్తున్నట్టు వాణిజ్య శాఖ సెక్రటరీ రాజేష్‌ అగర్వాల్‌ తెలిపారు. కొన్నింటిని ఈ వారంలోనే అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు. అమెరికా 50 శాతం టారిఫ్‌ల కారణంగా ఏర్పడిన ప్రభావం నుంచి ఎగుమతిదారులకు కొంత మేరకు ఉపశమనం లభిస్తుందన్నారు. అమెరికా టారిఫ్‌లు విధించినప్పటికీ.. 2025 ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు భారత ఎగుమతులకు యూఎస్‌ ప్రధాన కేంద్రంగా ఉన్నట్టు ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌’ (ఎఫ్‌ఐఈవో) ప్రెసిడెంట్‌ ఎస్‌సీ రల్హాన్‌ తెలిపారు.

యూఎస్‌కు 22 శాతం అధికం
నవంబర్‌లో అమెరికాకు ఎగుమతులు బలపడ్డాయి. వరుసగా రెండు నెలల పాటు (సెప్టెంబర్, అక్టోబర్‌) క్షీణత తర్వాత.. నవంబర్‌లో 22.61 శాతం మేర అధికంగా 6.98 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు యూస్‌ మార్కెట్‌కు వెళ్లాయి. భారత్‌పై 50 శాతం టారిఫ్‌లను ఆగస్ట్‌ నుంచి యూఎస్‌ అమలు చేస్తుండడం తెలిసిందే. అమెరికా నుంచి నవంబర్‌లో భారత్‌కు దిగుమతులు 38 శాతం పెరిగి 5.25 బిలియన్‌ డాలర్ల మేర ఉన్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు అమెరికాకు ఎగుమతులు 11.38 శాతం పెరిగి 59 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దిగుమతులు 13.49 శాతం పెరిగి 35.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)