Breaking News

ఏడాదిలో రూ.70.12 లక్షల కోట్ల ఎగుమతులు

Published on Sat, 05/03/2025 - 07:56

న్యూఢిల్లీ: అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ దేశ ఎగుమతులు బలమైన వృద్ధిని నమోదు చేశాయి. 2024–25లో 825 బిలియన్‌ డాలర్లు విలువైన (రూ.70.12 లక్షల కోట్లు) వస్తు, సేవల ఎగుమతులు నమోదైనట్టు వాణిజ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.778.13 బిలియన్‌ డాలర్లతో (రూ.66.14 లక్షల కోట్లు) పోల్చి చూస్తే 6 శాతం వృద్ధి కనిపించింది.

గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 820.93 బిలియన్‌ డాలర్లుగా ఏప్రిల్‌ 15న అంచనా వెల్లడించగా.. మార్చి నెలకు సంబంధించి సేవల ఎగుమతుల డేటాను ఆర్‌బీఐ విడుదల చేసిన నేపథ్యంలో మొత్తం ఎగుమతులను రూ.824.9 బిలియన్‌ డాలర్లకు సవరిస్తూ వాణిజ్య శాఖ గణాంకాలు విడుదల చేసింది. ఇందులో గత ఆర్థిక సంవత్సరంలో సేవల ఎగుమతులు 387.5 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2023–24లో ఉన్న 341.1 బిలియన్‌ డాలర్లతో పోల్చి చూస్తే 13.6 శాతం పెరిగాయి. మార్చి నెలకు సేవల ఎగుమతులు 18.6 శాతం పెరిగి 35.6 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం.

ఇదీ చదవండి: వర్షాలతో సాగు సమృద్ధి

సేవల ఎగుమతుల్లో టెలికమ్యూనికేషన్, కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌, ట్రాన్స్‌పోర్ట్, ట్రావెల్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కీలక పాత్ర పోషించాయి. ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో మెరుగ్గా ఉన్నట్టు భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) ప్రెసిడెంట్‌ ఎస్‌సీ రల్హాన్‌ తెలిపారు. అయితే, వాణిజ్య ఒప్పందం కోసం యూఎస్‌ దిగుమతిదారులు వేచి చూస్తున్నందున ఇది మన ఎగుమతులపై ప్రభావం చూపించొచ్చని చెప్పారు. ఎగుమతిదారులకు వడ్డీ రాయితీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో అధిక వడ్డీ రేట్లు ఉన్నాయని.. అంతర్జాతీయంగా పోటీ పడేందుకు వీలుగా కనీసం 5 శాతం మేర రాయితీ ఇవ్వాలని కోరారు.

Videos

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)