Breaking News

విదేశీ ఇన్వెస్టర్లకు ఇదో అద్భుత అవకాశం

Published on Sat, 03/21/2026 - 10:41

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లలో చోటుచేసుకున్న ఇటీవలి మార్పులు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు ఒక గొప్ప అవకాశంగా మారాయని సెబీ హోల్ టైమ్ మెంబర్ కమలేష్ చంద్ర వర్ష్‌నే పేర్కొన్నారు. ప్రస్తుత కరెక్షన్ వల్ల షేర్ల విలువ ఆకర్షణీయంగా మారాయని, ఇది భారత్‌లో పెట్టుబడులు పెంచుకోవడానికి సరైన సమయమని విశ్లేషించారు.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) వేదికగా జరిగిన ‘రష్యా-ఇండియా క్యాపిటల్ మార్కెట్ ఇంటిగ్రేషన్’ ఫోరంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత కొన్ని రోజులుగా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారత మార్కెట్లు కొంత ఒత్తిడికి లోనయ్యాయి. ఈ కరెక్షన్ వల్ల పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని వర్ష్‌నే తెలిపారు. అంతర్జాతీయ ఒడిదొడుకుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రయదారులుగా ఉన్నారు. కేవలం మార్చి మొదటి 15 రోజుల్లోనే సుమారు రూ.77,000 కోట్ల నిధులు బయటకు వెళ్లడం గమనార్హం. రష్యా ఇన్వెస్టర్లకు ఎదురవుతున్న సాంకేతిక, విధానపరమైన అడ్డంకులను తొలగించడానికి సెబీ సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. అవసరమైతే ప్రత్యేక వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.

‘భారతీయ మార్కెట్లలోని అనుబంధ సంస్థల విలువ, విదేశాల్లోని వారి మాతృ సంస్థల కంటే ఎక్కువగా ఉండటం చూస్తున్నాం. రష్యా కంపెనీలు భారత మార్కెట్లలో లిస్ట్ అవ్వడం ద్వారా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు’ అని తెలిపారు. భారతీయ మార్కెట్లు కేవలం పెట్టుబడితోపాటు అంతర్జాతీయ ఆర్థిక అనుసంధానానికి వేదికగా మారుతున్నాయని ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

Videos

పెద్ది విడుదల మళ్ళీ వాయిదా? వార్తల్లో నిజమెంత?

యువతకు ముష్టి వేస్తున్నారా? జాబ్ క్యాలెండర్ పై జడ శ్రవణ్ రియాక్షన్

హాట్ టాపిక్ కు అడ్డాగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ Vs పోప్

ఏపీలో ఈదురుగాలులతో భారీ వర్షాలు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

వలస కూలీలకు గుడ్ న్యూస్ కమర్షియల్ గ్యాస్ పై కేంద్రం కీలక నిర్ణయం

ఆ పేరు ఎత్తలంటేనే సిగ్గుగా ఉంది BR నాయుడుపై శ్యామల ఫైర్

పేర్ని కిట్టు ప్లెక్సీలపై కూటమి నేతల కడుపు మంట

మా భారతమ్మ పై పడి ఏడుస్తారు కదా ఉగాది వేడుకల్లో మరి మీ భార్యలు ఎక్కడ..?

పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారుల అవస్థలు

దాడులను ఖండిస్తూ ఇరాన్ ప్రధానికి మోదీ ఫోన్

Photos

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)

+5

డైరెక్టర్‌గా ‘జబర్దస్త్’ కమెడియన్‌..‘కామాఖ్య’ టీజర్‌ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వేలాది భక్తుల మధ్య కైరుప్పల పిడకల సంబరం (ఫొటోలు)

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)

+5

గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)