Breaking News

అమెరికాతో కలిసి పనిచేయాలి: అశ్విని వైష్ణవ్

Published on Sun, 09/07/2025 - 15:18

అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ఇండియన్ ఔట్‌సోర్సింగ్‌ కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకుంటున్న సమయంలో కేంద్ర మంత్రి 'అశ్విని వైష్ణవ్' కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 300 బిలియన్ డాలర్ల విలువైన భారతదేశ ఐటీ పరిశ్రమను కాపాడుకోవడానికి అమెరికాతో కలిసి పనిచేయాలని, ఇతర మల్టీనేషనల్ కంపెనీలతో కూడా టచ్‌లో ఉండాలని ఆయన పేర్కొన్నారు.

భారతీయ ఐటీ రంగాన్ని మాత్రమే కాకుండా.. ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, దీనికి కావలసిన చర్యలను కేంద్రం తీసుకుంటోందని మంత్రి అన్నారు. ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇండియా వాటా గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు.

మేము ఇప్పటికే అమెరికా, యూరప్, జపాన్, ఆగ్నేయాసియా ప్రభుత్వాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాము. భారతదేశంలోని పరిశ్రమలు శక్తివంతంగా ఉంచడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ సూచించారు. 5.67 మిలియన్లకు పైగా ఉద్యోగులను కలిగి ఉన్న, ఎగుమతి ఆదాయాలకు గణనీయంగా దోహదపడే భారతదేశ ఐటీ సేవల రంగం చాలా కాలంగా విదేశీ క్లయింట్లపై, ముఖ్యంగా అమెరికాలోని క్లయింట్లపై ఆధారపడింది.

ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన.. వాటిపై సుంకాలు ఎత్తివేత!

దేశంలో ఉద్యోగాలను రక్షించడం, కొత్త అవకాశాలను పెంచడం.. రెండింటినీ లక్ష్యంగా చేసుకుని ప్రస్తుత ఐటీ ఉపాధిని కాపాడటం, దేశీయ తయారీని పెంచడమే ప్రభుత్వం లక్ష్యం అని అశ్వని వైష్ణవ్ అన్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయం 5.1 శాతం పెరిగి 282.6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నాస్కామ్ అంచనా. ఇందులో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు వచ్చే ఆదాయంలో సుమారు 60 శాతం యూఎస్ నుంచే లభిస్తోంది.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు