Breaking News

ఎల్రక్టానిక్స్‌ ఎగుమతులు 47% అప్‌ 

Published on Fri, 08/08/2025 - 05:57

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎల్రక్టానిక్స్‌ ఎగుమతులు 12.4 బిలియన్‌ డాలర్లకు ఎగిశాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన 8.43 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 47 శాతం పెరిగాయి. ఇండియా సెల్యులార్, ఎల్రక్టానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొబైల్‌ ఫోన్స్‌ ఎగుమతులు 55 శాతం పెరిగి 4.9 బిలియన్‌ డాలర్ల నుంచి 55 శాతం వృద్ధితో 7.6 బిలియన్‌ డాలర్లకు ఎగిశాయి.

 మొబైల్‌యేతర ఎల్రక్టానిక్స్‌ సెగ్మెంట్‌ 3.53 బిలియన్‌ డాలర్ల నుంచి 37 శాతం పెరిగి 4.8 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ విభాగంలో సోలార్‌ మాడ్యూల్స్, స్విచి్చంగ్‌.. రూటింగ్‌ పరికరాలు, చార్జర్‌ అడాప్టర్లు, ఇతర విడిభాగాలు మొదలైనవి ఉన్నాయి. 

వీటితో పాటు ఐటీ హార్డ్‌వేర్, వేరబుల్స్, హియరబుల్స్, కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌ ఎగుమతులను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఐసీఈఏ చైర్మన్‌ పంకజ్‌ మహీంద్రూ చెప్పారు. విడిభాగాలు, సబ్‌–అసెంబ్లీస్‌ నుంచి తుది ఉత్పత్తుల వరకు వేల్యూ చెయిన్‌వ్యాప్తంగా అంతర్జాతీయంగా పోటీపడగలిగేలా భారతీయ బ్రాండ్లు మరింతగా ఎదగాల్సి ఉంటుందని మహీంద్రూ చెప్పారు. దశాబ్దకాలంలో దేశీయంగా మొత్తం ఎల్రక్టానిక్స్‌ ఉత్పత్తి 31 బిలియన్‌ డాలర్ల నుంచి 133 బిలియన్‌ డాలర్లకు ఎగిసింది. 

50 బిలియన్‌ డాలర్ల అంచనాలు.. 
క్యూ1 తరహాలోనే జోరు కొనసాగితే 2026 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఎల్రక్టానిక్స్‌ ఎగుమతులు 46–50 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని ఐసీఈఏ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇవి 29.1 బిలియన్‌ డాలర్ల నుంచి 38.6 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి.  

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)