Breaking News

డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐదే పెద్ద పాత్ర 

Published on Sun, 10/12/2025 - 04:11

న్యూఢిల్లీ: దేశంలో శరవేగంగా పెరుగుతున్న డిజిటల్‌ చెల్లింపులపై జెనరేటివ్‌ ఏఐ, ఏజెంటిక్‌ ఏఐ గణనీయమైన ప్రభావం చూపించనున్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. యూపీఐ ఇకపైనా కీలకంగా ఉంటుందంటూ.. అదే సమయంలో తదుపరి దశ డిజిటల్‌ చెల్లింపులను క్రెడిట్‌కార్డులు, భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (బీబీపీఎస్‌) నడిపించొచ్చని అంచనా వేసింది. 

ఫిన్‌టెక్, చెల్లింపుల రంగంలో కీలక స్థానాల్లో ఉన్న 175 మంది అభిప్రాయాలను పీడబ్ల్యూసీ ఇండియా తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. క్రెడిట్‌ కార్డు కీలక విభాగంగా ఉంటుందని 65 శాతం మంది చెప్పారు. కార్డు చెల్లింపులు బలంగా వృద్ధి చెందుతాయని 95 శాతం మంది భావిస్తున్నారు. చెల్లింపుల వ్యవస్థ ముఖచిత్రంపై జెనరేటివ్‌ ఏఐ, ఏజెంటిక్‌ ఏఐ ఎంతో ప్రభావం చూపించనున్నట్టు 73 శాతం మంది చెప్పారు.  

ఐదేళ్లలో మూడింతలు 
భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులు ఇక మీదట అధిక వృద్ధి వేగంతో కొనసాగుతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. 2030 మార్చి నాటికి మూడింతలు అవుతాయని అంచనా వేసింది. ఆవిష్కరణలకుతోడు రుణ సేవల విస్తరణ, నియంత్రణ సంస్థల మద్దతు, సరికొత్త టెక్నాలజీలను స్వీకరించడం, మారుతున్న వినియోగదారుల వైఖరి డిజిటల్‌ చెల్లింపుల వేగాన్ని నడిపిస్తాయని పేర్కొంది.

 ‘‘భారత్‌లో చెల్లింపుల ఎకోవ్యవస్థ కొత్త దశలోకి అడుగుపెడుతోంది. వచ్చే ఐదేళ్లలో యూపీఐ ఆవిష్కరణలు, సేవల విస్తరణ కొనసాగుతుంది. రుణాల్లో వృద్ధి, బీమా, సంపద కలయికతో డిజిటల్‌ చెల్లింపులు పెరుగుతాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్‌ మిహిర్‌గాంధీ తెలిపారు. వివిధ సాధనాల మధ్య అనుసంధానత ద్వారా ఆవిష్కరణలు–విస్తరణ మధ్య సమతూకం ఉండేలా చూడడం అవసరమన్నారు.  

90% చెల్లింపులవే..
భారత డిజిటల్‌ చెల్లింపులకు యూపీఐ వెన్నెముకగా నిలుస్తున్నట్టు, 2024–25లో రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో 90 శాతం యూపీఐ రూపంలోనే ఉన్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. క్రెడిట్‌ కార్డు లావాదేవీలు 2023–24లో 100 మిలియన్‌ దాటగా, 2030 మార్చి నాటికి 200 మిలియన్‌కు చేరుకుంటాయని పేర్కొంది. వినియోగదారులు యూపీఐ, క్రెడిట్‌కార్డులకు ప్రాధాన్యం ఇస్తుండడంతో డెబిట్‌ కార్డుల వినియోగం ఇకమీదటా తగ్గనున్నట్టు తెలిపింది.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)