Breaking News

డిజిటల్‌ విప్లవం: క్యాష్‌కు చెక్‌..  యూపీఐదే హవా!

Published on Sun, 02/22/2026 - 05:22

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో డిజిటల్‌ చెల్లింపుల విప్లవం సామాన్యుడి జీవనశైలిని సమూలంగా మార్చేసింది. చిల్లర కష్టాలకు చెక్‌ పెడుతూ.. గల్లీ లోని కిరాణా షాపు నుంచి మల్టీప్లెక్స్‌ల వరకు ఎక్క డ చూసినా ఇప్పుడు ‘స్కాన్‌ అండ్‌ పే’ మంత్రమే మార్మోగుతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, రూపే డెబిట్‌ కార్డులు, తక్కువ–విలువ కలిగిన భీమ్‌–యూపీఐ లావాదేవీల వల్ల దేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ మేరకు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌), నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ) సంయుక్తంగా విడుదల చేసిన ‘సామాజిక–ఆర్థిక ప్రభావ విశ్లేషణ’ నివేదికలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనాన్ని ఇప్సోస్‌ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించింది. 

యూపీఐ సంచలనం.. రికార్డుల మోత 
గత ఎనిమిదేళ్ల వ్యవధిలో దేశంలో డిజిటల్‌ లావాదేవీలు ఏకంగా 11 రెట్లు పెరిగాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2,071 కోట్లుగా ఉన్న ఆన్‌లైన్‌ లావాదేవీల సంఖ్య 2024–25 నాటికి 22,831 కోట్లకు చేరింది. మొత్తం డిజిటల్‌ చెల్లింపుల్లో ఒకప్పుడు కేవ లం 4 శాతంగా ఉన్న యూపీఐ వాటా.. ఇప్పు డు ఏకంగా 80 శాతానికి చేరుకుని అగ్రగామిగా నిలిచింది. పీర్‌–టు–మర్చంట్‌ అంటే వినియోగదారు లు వ్యాపారులకు చేసే చెల్లింపుల్లో 26 రెట్ల భారీ వృద్ధి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్‌–టైమ్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో 49% వాటాతో మన దేశం గ్లోబల్‌ లీడర్‌గా కొనసాగుతోంది. 

తగ్గుముఖం పట్టిన ఏటీఎం క్యూలు 
దేశంలో యూపీఐ వాడకం విపరీతంగా పెరగడంతో జేబులో నగదు పెట్టుకుని తిరిగే వారి సంఖ్య గ ణనీయంగా తగ్గింది. నివేదిక ప్రకారం.. 59% మంది వినియోగదారులు, 57% మంది వ్యాపారులు తమ దైనందిన జీవితంలో నగదు వాడకం బాగా తగ్గిపోయిందని స్పష్టం చేశారు. నగదు డ్రా చేసేందుకు బ్యాంకులకు వెళ్లే వినియోగదారుల సంఖ్య 69%  మేర తగ్గిపోగా, ఏటీఎంల నుంచి డబ్బు లు డ్రా చేయడం 62% మేర పడిపోయింది. వ్యాపారుల్లో ఏటీఎం విత్‌డ్రాలు 61% మేర తగ్గాయి. 

జీడీపీకి భారీ ఆర్థిక ఊతం 
నగదు నిర్వహణ ఖర్చులు తగ్గడం, డిజిటల్‌ లావాదేవీల్లో పారదర్శకత పెరగడం ద్వారా యూపీఐ ఏకంగా భారత జీడీపీకి (2022 సంవత్సరంలో) అదనంగా 16.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 1.3 లక్షల కోట్లు) జోడింపును అందించినట్లు ఈ నివేదిక వెల్లడించింది. లావాదేవీలపై అదనపు రుసుములు లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. 

మారుమూల ప్రాంతాల్లోనూ మారుమోగుతున్న ‘స్కాన్‌ అండ్‌ పే’ 
డిజిటల్‌ చెల్లింపుల మద్దతు కేవలం మహానగరాలకే పరిమితం కాలేదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, మారుమూల ప్రాంతాల్లోనూ యూపీఐ క్యూఆర్‌ కోడ్‌లు విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. వృద్ధి రేటును గమనిస్తే.. లక్షదీ్వప్‌లో ఏకంగా 136%, మేఘాలయలో 83%, జమ్మూకాశీ్మర్‌లో 76% మేర యూపీఐ లావాదేవీల వృద్ధి నమోదైంది. 

వినియోగదారులు ఏమనుకుంటున్నారు? 
చాలా సులభంగా వాడుకునే వీలుండటం (63%), తక్షణమే ఇతరుల ఖాతాల్లోకి నగదు బదిలీ జరగడం (59%) వల్లే యూపీఐను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు వినియోగదారులు సర్వేలో తెలిపారు. క్యాష్‌బ్యాక్‌ ఆఫ ర్లు (52%), మెరుగైన ఇంటర్నెట్‌ సౌకర్యం (37%), మెరుగైన భద్రతా ఫీచర్లు (36%) లాంటివి డిజిటల్‌ చెల్లింపుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నా యి. మరింత మందికి చేరువయ్యేందుకు స్థానిక భాష ల్లో యాప్స్‌ అందుబాటులో ఉండాలని 21% మంది అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు నగదు కోసం ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరిగిన సగటు భారతీయుడు.. ఇప్పుడు తన స్మార్ట్‌ఫోన్‌నే బ్యాంక్‌గా మా ర్చుకుని పారదర్శకమైన ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నాడని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది.  

Videos

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)