Breaking News

ఆర్థిక వృద్ధిలో క్లౌడ్, జీసీసీల కీలక పాత్ర

Published on Sat, 01/25/2025 - 04:28

న్యూఢిల్లీ: భారత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో క్లౌడ్‌ మార్కెట్, గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగాలుగా కేంద్ర ప్రభుత్వం నివేదిక స్పష్టం చేసింది. దేశ జీడీపీలో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ వాటా 2030 నాటికి 20 శాతానికి చేరుకుంటుదని తెలిపింది. కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ (మైటీ), కౌన్సిల్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనమిక్‌ రిలేషన్స్‌ (ఐసీఆర్‌ఐఈఆర్‌) సంయుక్త నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. 

2022–23 నాటికి జీడీపీలో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం రూ.31.64 లక్షల కోట్ల మేర ఉన్నట్టు తెలిపింది. డిజిటల్‌ ఎకానమీలో సంప్రదాయ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ (ఐసీటీ) ఇక ముందూ అతిపెద్ద విభాగంగా కొనసాగుతుందని పేర్కొంది. 2023నాటికి అంతర్జాతీయంగా భారత క్లౌడ్‌ మార్కెట్‌ వాటా 1.1–1.2 శాతం మేర ఉంటుందని వివరించింది. ‘‘భారత డిజిటల్‌ ఎకానమీ చాలా వేగంగా రెట్టింపు కానుంది. 

2029–30 నాటికి 20 శాతం వాటాను అందించనుంది. వచ్చే ఆరేళ్లలో సంప్రదాయ వ్యవసాయం, తయారీని మించి డిజిటల్‌ ఎకానమీ ఎదగనుంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. 2023లో ఐసీటీ ఎగుమతులు 162 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఐర్లాండ్‌ 236 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల తర్వాత రెండో పెద్ద ఎగుమతిదారుగా భారత్‌ నిలవడం గమనార్హం. 2023–24లో 1644 బిలియన్‌ డిజిటల్‌ లావాదేవీలు నమోదయ్యాయి.  

20 బిలియన్‌ డాలర్లకు క్లౌడ్‌ మార్కెట్‌ 
‘‘కంపెనీలు జనరేటివ్‌ ఏఐని అందిపుచ్చుకోవడం పెరుగుతోంది. తద్వారా ఉత్పాదకత, కస్టమర్‌ అనుభవాన్ని పెంచుకోవడం, కొత్త సేవల ప్రారంభంతో క్లౌడ్‌ మార్కెట్‌ ఏటా 24 శాతం చొప్పున పెరుగుతూ 2027 నాటికి 20.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. జీసీసీలకు భారత్‌ అంతర్జాతీయ కేంద్రంగా మారిందని, 2022 నాటికి ప్రపంచంలోని జీసీసీల్లో 55 శాతం భారత్‌లోనే ఉన్నట్టు తెలిపింది. పరిశోధన, అభివృద్ధి, ఐటీ సపోర్ట్‌ సేవలు, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ తదితర సేవల కోసం ఎంఎన్‌సీలు జీసీసీలను ఏర్పాటు చేస్తుంటాయి.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)