Breaking News

85% పేమెంట్స్‌ యూపీఐ నుంచే..

Published on Mon, 10/20/2025 - 12:41

దేశంలో 85 శాతం డిజిటల్‌ చెల్లింపులు యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) రూపంలోనే జరుగుతున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా తెలిపారు. ప్రతి నెలా 20 బిలియన్‌ యూపీఐ లావాదేవీలు నమోదవుతున్నాయని, వీటి విలువ 280 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు చెప్పారు.

సమ్మిళిత, సురక్షిత, విస్తరణకు అనుకూలమైన డిజిటల్‌ పబ్లిక్‌ ఫ్లాట్‌ఫామ్‌ల (డీపీపీలు) విషయంలో భారత్‌ ప్రపంచానికి ఒక కేసు స్టడీ (అధ్యయనం చేయతగిన) అవుతుందన్నారు. వాషింగ్టన్‌లో ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌  వార్షిక సమావేశాల సందర్భంగా ఆర్‌బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా మల్హోత్రా మాట్లాడారు.

సమ్మిళిత వృద్ధి, ఆవిష్కరణలకు డిజిటల్‌ పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్‌లు ప్రేరణినిస్తున్నట్టు చెప్పారు. డిజిటల్‌ గుర్తింపునకు ఉద్దేశించిన ఆధార్, రియల్‌టైమ్‌ చెల్లింపులకు వీలు కల్పిస్తున్న యూపీఐ ద్వారా.. తక్కువ వ్యయాలతో, ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించే వ్యవస్థలకు ఎలా నిర్మించొచ్చో విజయవంతంగా చూపించినట్టు పేర్కొన్నారు.

డిజిటల్‌ పరివర్తనను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు, ‘వసుదైక కుటుంబం’ స్ఫూర్తితో అంతర్జాతీయ సహకారానికి భారత్‌ కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. యూపీఐని ఒక ముఖ్యమైన డిజిటల్‌ పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్‌గా పేర్కొంటూ, చెల్లింపుల ముఖచిత్రాన్ని ఇది పూర్తిగా మార్చేసినట్టు చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)