Breaking News

భారత్-కెనడా మధ్య చిగురిస్తున్న వాణిజ్య బంధం

Published on Sat, 12/27/2025 - 15:09

భారత్-కెనడా దేశాల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న దౌత్యపరమైన స్తబ్ధత వీడనుంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగవ్వనున్నాయి. ఈ దేశాల మధ్య అత్యంత కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) లేదా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (కాంప్రిహెన్సివ్‌ ఎకనామిక్‌ పార్టనర్‌షిప్‌ అగ్రిమెంట్‌-CEPA) పునరుద్ధరణకు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా చర్చలు ప్రారంభం కానున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కీలక పర్యటనలు - సన్నాహక చర్చలు

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరిలో కెనడాలో పర్యటించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా చర్చలకు పచ్చజెండా ఊపనున్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య అనధికారికంగా సన్నాహక చర్చలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాల తరహాలోనే కెనడా కూడా పరస్పర రాయితీలతో కూడిన ఒక బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవాలని రంగం సిద్ధం చేస్తోంది.

మార్క్ కార్నీ రాకతో మారిన సమీకరణాలు

2023 సెప్టెంబర్‌లో హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణం విషయంలో జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన సంగతి తెలిసిందే. అయితే, 2025 మార్చిలో మార్క్ కార్నీ కెనడా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. ఇటీవల జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన భేటీ ఈ ఒప్పందానికి పునాది వేసింది.

50 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం లక్ష్యం

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశీ ఉత్పత్తులపై (భారతీయ వస్తువులపై 50% వరకు) భారీ టారిఫ్‌లు విధిస్తున్న నేపథ్యంలో భారత్-కెనడా ఒప్పందం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 2030 నాటికి ఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. కెనడా ప్రభుత్వం ఇప్పటికే డిసెంబర్ 13, 2025 నుంచి జనవరి 27, 2026 వరకు ఈ ఒప్పందంపై ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది.

రాజకీయ ఉద్రిక్తతలను పక్కన పెట్టి ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా భారత్, కెనడాలు ముందుకు సాగుతున్నాయి. ఫిబ్రవరిలో పీయూష్ గోయల్ పర్యటనతో ఈ ఒప్పందం పట్టాలెక్కితే అది రెండు దేశాల వ్యవసాయం, ఐటీ, తయారీ రంగాల్లోని ఎగుమతిదారులకు ఊరటనిస్తుంది.

ఇదీ చదవండి: రేషన్‌ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)