Breaking News

రూ. 1.5 లక్షల కోట్లకు  రష్యా చమురు కొనుగోళ్లు 

Published on Sun, 03/09/2025 - 05:18

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా నుంచి భారత్‌ దాదాపు 112.5 బిలియన్‌ యూరోల (సుమారు రూ. 1.5 లక్షల కోట్లు) ముడి చమురు కొనుగోలు చేసినట్లు సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌ (క్రియా) ఒక నివేదికలో తెలిపింది. రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు మొదలైన 2022 ఫిబ్రవరి 24 నుంచి శిలాజ ఇంధనాలకు సంబంధించి రష్యాకు లభించిన చెల్లింపుల వివరాలను ఇందులో పొందుపర్చింది. దీని ప్రకారం యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా శిలాజ ఇంధన ఎగుమతుల ద్వారా 835 బిలియన్‌ యూరోల ఆదాయం ఆర్జించినట్లు వివరించింది. 

చైనా అత్యధికంగా 235 బిలియన్‌ యూరోల (170 బిలియన్‌ యూరోల చమురు, 34.3 బిలియన్‌ యూరోల బొగ్గు, 30.5 బిలియన్‌ యూరోల గ్యాస్‌) ఇంధనాలు కొనుగోలు చేసింది. భారత్‌ 205.84 బిలియన్‌ యూరోల ఇంధనాలను కొనుగోలు చేసింది. ఇందులో 112.5 బిలియన్‌ యూరో క్రూడాయిల్, 13.25 బిలియన్‌ డాలర్ల బొగ్గు ఉంది. యుద్ధం వల్ల విధించిన ఆంక్షలతో రష్యా చమురు చౌకగా లభిస్తున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి భారత్‌ గణనీయంగా కొనుగోళ్లు పెంచుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు బ్యారెల్‌కి 18–20 శాతం వరకు లభించిన డిస్కౌంటు ఇటీవలి కాలంలో 3 డాలర్ల దిగువకు పడిపోయింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)