Breaking News

బ్రెజిల్‌ను దాటేసిన భారత్.. డొమెస్టిక్ ఎయిర్‌లైన్ మార్కెట్‌లో రికార్డ్

Published on Fri, 06/21/2024 - 17:10

భారతదేశంలో ఏవియేషన్ రంగంలో బలమైన వృద్ధి చెందుతోంది. పది సంవత్సరాల ముందు 5వ స్థానంలో ఉన్న ఇండియన్ ఎయిర్‌లైన్ మార్కెట్‌.. ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌గా అవతరించింది.

పది సంవత్సరాల క్రితం భారతదేశం దాదాపు 8 మిలియన్ సీట్లతో అతి చిన్న మార్కెట్‌గా ఉండేది. ఆ సమయంలో ఇండోనేషియా 4వ స్థానంలో,బ్రెజిల్ 3వ స్థానంలో, అమెరికా, చైనా మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. అయితే ఇప్పుడు భారత్ ఎయిర్‌లైన్ మార్కెట్‌ భారీగా వృద్ధి చెంది బ్రెజిల్‌ను వెనక్కు నెట్టి ఇండియా ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఇండోనేషియా ఐదు, బ్రెజిల్ నాలుగు, అమెరికా రెండు, చైనా మొదటి స్థానాల్లో ఉన్నాయి. కేవలం పది సంవత్సరాల్లో భారాతదేశ ఎయిర్‌లైన్ సీట్ల వృద్ధి రేటు మొదటి ఐదు దేశాల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్లలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 157కి పెరిగింది.

గత 10 సంవత్సరాలలో ఇండిగో మార్కెట్ వాటా రెట్టింపు అయింది. 2014లో 32 శాతం ఉన్న ఇండిగో సామర్థ్యం నేడు 62 శాతానికి చేరింది. ఇండిగో దేశీయ సామర్థ్యం వృద్ధి రేటు వార్షికంగా 13.9 శాతంగా ఉందని తెలుస్తోంది. భారతదేశంలో డొమెస్టిక్ విమానాల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో భారత్ ఈ రంగంలో మరింత వృద్ధి చెందుతుంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)