2025 చివరికి గానీ సాధ్యం కాదు..

Published on Tue, 05/27/2025 - 06:11

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో జపాన్‌ను అధిగమించి భారత్‌ నాలుగో స్థానాన్ని ఆక్రమించడంపై నీతి ఆయోగ్‌లో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్‌ నాలుగో స్థానానికి చేరిందంటూ నీతి ఆయోగ్‌ సీఈవో సుబ్రహ్మణ్యన్‌ ఇటీవల వెల్లడించగా.. ఇంకా ప్రక్రియ కొనసాగుతోందని, ఈ ఏడాది ఆఖరు నాటికి గానీ ఆ హోదా రాదని సంస్థ సభ్యుడు అరవింద్‌ విర్మానీ వ్యాఖ్యానించారు. 

ఇందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ఏప్రిల్‌లో విడుదల చేసిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఔట్‌లుక్‌ (డబ్ల్యూఈవో) నివేదికను ప్రస్తావించారు. ‘భారత్‌ నాలుగో పెద్ద ఎకానమీగా ఎదిగే ప్రక్రియ కొనసాగుతోంది. 2025 ఆఖరు నాటికి భారత్‌ ఆ స్థానాన్ని తప్పకుండా దక్కించుకుంటుందని నేను వ్యక్తిగతంగా ధీమాగా ఉన్నాను. ఆ హోదాను ధ్రువీకరించుకోవడానికి మొత్తం 12 నెలల జీడీపీ గణాంకాలు అవసరమవుతాయి. అప్పటిదాకా ఇవన్నీ అంచనాలే‘  అని ఆయన చెప్పారు. 

ఇక సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా.. ‘ఇది ఒక క్లిష్టమైన విషయం. ఆయన కచి్చతంగా ఏం మాట్లాడారో, ఏం పదాలు ఉపయోగించారో నాకు తెలియదు. బహుశా ఏదైనా పదం మిస్‌ అయి ఉండొచ్చు లేదా ఇంకేమైనా జరిగి ఉండొచ్చు‘ అని విర్మానీ పేర్కొన్నారు. 

సుబ్రహ్మణ్యం కూడా ఐఎంఎఫ్‌నే ఉటంకిస్తూ భారత్‌ ఇప్పుడు జపాన్‌ను దాటి నాలుగో పెద్ద ఎకానమీగా ఆవిర్భవించిందంటూ గత వారం ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 2025లో జపాన్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 4.186 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని, భారత జీడీపీ దాని కన్నా స్పల్పంగా అధికంగా 4.187 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది.  
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)