Breaking News

టాప్‌గేర్‌లో ఆటో సేల్స్‌

Published on Tue, 02/03/2026 - 09:17

జీఎస్‌టీ సంస్కరణలతో బలపడిన వృద్ధి ధోరణిని ఆసరాగా చేసుకొని ప్రముఖ ఆటో సంస్థలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం, హ్యుందాయ్‌ మోటార్‌లు జనవరిలోనూ గణనీయమైన వాహన అమ్మకాలను నమోదు చేశాయి. మారుతీ సుజుకీ జనవరిలో 1,74,529 వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఇదే ఏడాది అమ్ముడైన 1,73,599 వాహనాలతో పోలిస్తే 0.50% అధికంగా ఉన్నాయి. విదేశాలకు చేసిన ఎగుమతులు(51,020), ఇతర సంస్థలకు అమ్మకాలు(7,643) కలిపి మొత్తం విక్రయాలు 2,36,963 యూనిట్లుగా నమోదయ్యాయి.  

‘మునుపెన్నడూ లేనంతంగా నెలవారీ ప్రాతిపదికన మొత్తం 2,36,963 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ప్రతిరోజూ 9,000 నుంచి 10,000 బుకింగ్స్‌ నమోదవుతూ.., మొత్తం 2.78 లక్షలకు మించి బుకింగ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి వార్షిక ప్రతిపాదికన ఇవి 25% అధికం. కంపెనీ కొత్తగా విడుదల చేసిన ఎస్‌యూవీ విక్టోరిస్‌ అయిదు నెలల్లో 50వేల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది’ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ తెలిపారు. ఉత్పత్తి కొరతపై స్పందిస్తూ..., కొత్త ఉత్పత్తి సామర్థ్యాలు అందుబాటులోకి వచ్చే వరకు కంపెనీకి కొరత కష్టాలు తప్పవన్నారు.

  • టాటా ప్యాసింజర్‌ వెహికల్స్‌ లిమిటెడ్‌ జనవరిలో మొత్తం 61,295 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 48,423 యూనిట్లతో పోలిస్తే విక్రయాల్లో 46% వృద్ధి నమోదైంది.

  • మహీంద్రా అండ్‌ మహీంద్రా దేశీయంగా 63,510 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే అక్టోబర్‌ అమ్మకాలు 50,659 యూనిట్లతో పోలిస్తే ఇవి 25% అధికంగా ఉన్నాయి.  

  • హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా మొత్తం 59,107 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే జనవరిలో అమ్మిన 54,003 యూనిట్లతో పోలిస్తే ఇవి 9% అధికం.

  • టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ అమ్మకాల వృద్ధి 17% పెరిగి 26,178 నుంచి 30,630 యూనిట్లకు చేరింది.

  • రెనో ఇండియా డీలర్ల పంపిణీ 34% పెరిగి 3,715 యూనిట్లకు చేరింది. గతేడాది ఇదే నెలలో అమ్మకాలు 2,780 యూనిట్లుగా ఉన్నాయి.

కియా ఇండియా వార్షిక అమ్మకాల వృద్ధి 10% పెరిగి 27,603 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘‘కొత్త ఏడాది (2026) ప్రోత్సాహకర ప్రారంభం కియా బ్రాండ్‌పై కస్టమర్ల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. కొత్త తరం సెల్టోస్‌కు లభిస్తున్న సానుకూల స్పందన, సోనెట్‌కు కొనసాగుతున్న స్థిరమైన డిమాండ్, అలాగే కారెన్స్‌ క్లావిస్, క్లావిస్‌ ఈవీ మోడళ్లకు పెరుగుతున్న ఆదరణ పరిశీలిస్తే కియా ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో బలం, సమతుల్యతకు అద్దం పడుతుంది’’ అని కియా ఇండియా సీనియర్‌ వైస్‌–ప్రెసిడెంట్‌ అతుల్‌ సూద్‌ తెలిపారు.

ఇదీ చదవండి: మార్కెట్లు జోరందుకుంటాయా?

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)