Breaking News

ఒక్కటి కాదు.. వస్తున్నాయ్‌ 100 రిలయన్స్‌లు

Published on Thu, 02/05/2026 - 06:14

ముంబై: దేశాభివృద్ధికి శాంతి భద్రతలు, స్థిరమైన నాయకత్వం కీలకమని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చెప్పారు. భారత్‌ నిలకడగా రెండంకెల స్థాయి వృద్ధిని సాధించడం సాధ్యమేనని స్పష్టం చేశారు. జియోబ్లాక్‌రాక్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. పటిష్టమైన ఆర్థిక ప్రగతికి 15–20 ఏళ్ల పాటు శాంతి భద్రతలు, సామాజిక సామరస్యత అవసరమని తెలిపారు. సమాచారం, వినియోగం, వాణిజ్యంలాంటి అంశాల్లో పరివర్తనకు భారత్‌ సాంకేతికతను ఉపయోగించుకుంటున్న తీరు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 100 కంపెనీలు కొత్తగా రిలయన్స్‌ స్థాయికి ఎదిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంబానీ చెప్పారు.  

ఏఐ గురించి ఆందోళన వద్దు: ఏఐ గురించి భయపడనక్కర్లేదని, పారిశ్రామిక విప్లవంతో కొంత ఆందోళనకర పరిస్థితి ఏర్పడినా, మానవాళి ముందుకే సాగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. దేశీయంగా ప్రతి గ్రామంలోనూ 5జీ నెట్‌వర్క్‌ ఉందని, మిగతా ఏ దేశంతో పోలి్చనా మెరుగ్గా, చౌకగా 5జీ సేవలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.  

మార్కెట్‌తోనే సంపద సాధ్యం: ల్యారీ ఫింక్‌: రాబోయే రోజుల్లో పది సంవత్సరాలకు పైగా భారత్‌ ఏటా 8–10 శాతం వృద్ధి చెందుతుందని, ఇది భారత్‌ శకం అని గ్లోబల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ దిగ్గజం బ్లాక్‌రాక్‌ చైర్మన్‌ ల్యారీ ఫింక్‌ చెప్పారు. భారతీయులు డబ్బంతా బ్యాంక్‌ డిపాజిట్లలోనే ఉంచకుండా క్యాపిటల్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అధిక ప్రయోజనం పొందవచ్చని ఆయన తెలిపారు. ఇందుకు అమెరికానే నిదర్శనమని ఫింక్‌ చెప్పారు.  వచ్చే అయిదేళ్లలో దేశీయంగా మ్యుచువల్‌ ఫండ్స్‌ ఏయూఎం ప్రస్తుత రూ. 80 లక్షల కోట్ల నుంచి రెట్టింపు స్థాయికి పెరుగుతుందని జియో ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ చైర్మన్‌ కేవీ కామత్‌ చెప్పారు. టెక్నాలజీ, ఆర్థిక రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బ్యాంకులు తమను తాము సరికొత్తగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుందన్నారు.

Videos

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

కొండా రాజీనామా! కొండా సురేఖ సంచలన నిర్ణయం

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టేసిన బాబు

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)