పెట్రోలు వెతల సిత్రాలు చూశారా..!
Breaking News
వీసాల పొడిగింపు.. భారత్ గుడ్ న్యూస్
Published on Sat, 03/14/2026 - 01:57
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభావిత విదేశీ పౌరులకు అన్ని రకాల వీసాలకు 30 రోజుల పాటు పొడిగింపు ఇవ్వాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఎక్కువ కాలం బస చేసినందుకు విధించే జరిమానాలను కూడా మాఫీ చేయనున్నట్లు వెల్లడించింది.
దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ శుక్రవారం సాయంత్రం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. రెగ్యులర్ వీసాలు, ఈ-వీసాలు సహా అన్ని రకాల వీసాలకు ఈ సడలింపులు వర్తిస్తాయని తెలిపింది.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో పలువురు విదేశీయులు ప్రయాణ సమస్యల కారణంగా తమ దేశాలకు వెళ్లలేకపోతున్నారు.
వీసా పొడిగింపు, జరిమానా మాఫీ
భారత ప్రభుత్వం ప్రకటించిన సడలింపులు ఇలా ఉన్నాయి..
గడువు ముగిసిన లేదా త్వరలో ముగియనున్న అన్ని రకాల వీసాలకు ఒక నెల పాటు పొడిగింపు.
కేసు ప్రాతిపదికన ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ద్వారా ఈ పొడిగింపు మంజూరు.
ఫిబ్రవరి 28, 2026 తర్వాత ఎక్కువ కాలం బస చేసిన విదేశీయులపై విధించే జరిమానా పూర్తిగా మాఫీ.
ఎగ్జిట్ పర్మిట్, తాత్కాలిక ల్యాండింగ్ పర్మిట్‌పై సడలింపు
యుద్ధ పరిస్థితుల వల్ల చిక్కుకుపోయిన విదేశీయులకు భారత్ మరిన్ని సడలింపులు ప్రకటించింది.
అవసరమైన విదేశీయులకు ఎగ్జిట్ పర్మిట్లు ఉచితంగా జారీ.
ఎగ్జిట్ పర్మిట్ కోసం దరఖాస్తు చేయకపోవడం వలస చట్ట ఉల్లంఘనగా పరిగణించరు.
విమానాల మళ్లింపు కారణంగా భారత్‌కు వచ్చే విదేశీయులకు తాత్కాలిక ల్యాండింగ్ పర్మిట్ (TLP) మంజూరు.
ముందుగానే సూచనలు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ప్రారంభమైన వెంటనే, మార్చి 1న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విదేశీ పౌరులకు సూచనలు జారీ చేసింది. వీసా పొడిగింపు లేదా బసను క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉన్నవారు తమ సమీపంలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)ను సంప్రదించాలని సూచించింది.
Tags : 1