Breaking News

భారత్‌కు త్వరలో టెక్‌ కంపెనీ సీఈఓలు రాక

Published on Tue, 02/10/2026 - 11:34

న్యూఢిల్లీ వేదికగా భారత్‌లో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సు జరగనుంది. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ గమనాన్ని నిర్దేశించే ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. న్యూఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరగనున్న ఈ ఐదు రోజుల సదస్సు గ్లోబల్ సౌత్‌లో నిర్వహిస్తున్న మొదటి అతిపెద్ద ఏఐ సదస్సుగా రికార్డు సృష్టించనుంది.

దిగ్గజ కంపెనీల సారథులు

ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ టెక్ రంగంలోని అత్యంత ప్రభావవంతమైన నేతలు ఢిల్లీకి రాబోతున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, బిల్‌గేట్స్‌, క్వాల్‌కామ్ సీఈఓ క్రిస్టియానో అమోన్, గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు. ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ సైతం భారత్ చేరుకోనున్నారనే వార్తలొస్తున్నాయి. అధికారిక జాబితాలో తన పేరు లేకపోయినప్పటికీ ఆయన క్లోజ్డ్ డోర్ సమావేశాల్లో పాల్గొంటారని, ఫిబ్రవరి 19న ప్రత్యేక ఓపెన్‌ఏఐ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.

దేశీయంగా కూడా ఈ సమ్మిట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, భారతీ ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, ఇన్ఫోసిస్ నందన్ నీలేకని, సలీల్ పరేఖ్, హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ సి.విజయకుమార్ వంటి దేశీయ పారిశ్రామిక వేత్తలు భారత ఏఐ విజన్ గురించి ప్రసంగించనున్నారు.

సదస్సు ప్రత్యేకతలు

ప్రభుత్వం ఈ సమ్మిట్‌ను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా వాస్తవ ఫలితాల సాధన దిశగా రూపొందించింది. పీపుల్ (ప్రజలు), ప్లానెట్ (భూమి), ప్రోగ్రెస్ (పురోగతి) అనే మూడు అంశాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సుపరిపాలన.. వంటి ఏడు కీలక రంగాల్లో ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే 35,000కు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు, 500కు పైగా స్టార్టప్‌లు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నాయి.

ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్‌డేట్స్‌

#

Tags : 1

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)