Breaking News

5జీ యూజర్లు @ 98 కోట్లు..!

Published on Thu, 06/26/2025 - 06:31

న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ టెలికం యూజర్లు (చందాదారులు) 2030 నాటికి 98 కోట్లకు చేరుకుంటారని, అప్పటికి 4జీ చందాదారుల సంఖ్య 60 శాతం తగ్గి 23 కోట్లకు పరిమితం అవుతుందని టెలికం గేర్ల తయారీ సంస్థ ఎరిక్సన్‌ తెలిపింది. ‘‘2024 చివరికి 5జీ చందాదారులు 29 కోట్లకు పెరిగారు. మొత్తం మొబైల్‌ సబ్‌్రస్కిప్షన్లలో 24 శాతంగా ఉన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 98 కోట్లకు చేరుకుంటుంది. మొత్తం చందాదారుల్లో 5జీ యూజర్లు 75 శాతానికి పెరుగుతారు’’అని ఎరిక్సన్‌ మొబిలిటీ రిపోర్ట్‌ వెల్లడించింది. 2024లో ఒక్కో స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా 32జీబీ డేటా వినియోగంతో భారత్‌ ప్రపంచంలో డేటా రద్దీ పరంగా మొదటి స్థానంలో నిలిచినట్టు తెలిపింది.

 2030 నాటికి ఒక్కో స్మార్ట్‌ఫోన్‌ డేటా వినియోగం 66జీబీకి పెరుగుతుందని అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా బలమైన 5జీ నెట్‌వర్క్‌ అవసరం ఉంటుందని పేర్కొంది. వేగంగా 5జీ స్మార్ట్‌ఫోన్లకు యూజర్లు మారుతుండడం, డేటా వినియోగానికి డిమాండ్‌ పెరుగుతున్నట్టు వివరించింది. ‘‘బ్రాడ్‌బ్యాండ్‌ అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. 5జీ ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ (ఎఫ్‌డబ్ల్యూఏ) విస్తరణ దిశగా సరీ్వస్‌ ప్రొవైడర్లను ఈ డిమాండ్‌ నడిపిస్తుంది. భారత్‌లో అందుబాటులో ఉన్న 5జీ మిడ్‌బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌.. సామర్థ్యం, నెట్‌వర్క్‌ విస్తరణ అవసరాలకు సరిపోతుంది. ఇది యూజర్‌ అనుభవం పెరిగేందుకు వీలు కలి్పస్తుంది’’అని ఎరిక్సన్‌ నివేదిక వివరించింది.   
 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)