Breaking News

సవాళ్లున్నా.. భారత్‌ భేష్‌

Published on Fri, 04/10/2026 - 04:58

న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలను తట్టుకునేలా భారత్‌ పటిష్టమైన స్థితిలోనే ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. భారీ స్థాయిలో విదేశీ మారక నిల్వలు, తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం, మరింతగా వ్యయం చేయగలిగే సామర్థ్యాల వల్ల గ్లోబల్‌ ఇంధన షాక్‌లను ఎదుర్కొనగలదని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) వృద్ధి అంచనాలను 6.6 శాతానికి పెంచినట్లు పేర్కొంది. 

గత ఆర్థిక సంవత్సరం వాణిజ్య సంక్షోభాలను సమర్ధవంతంగా ఎదుర్కొన్న భారత్, ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభంలోకి పటిష్టమైన స్థితిలోనే అడుగుపెట్టిందని వరల్డ్‌ బ్యాంక్‌ రీజనల్‌ ప్రాక్టీస్‌ డైరెక్టర్‌ (దక్షిణాసియా) సెబాస్టియన్‌ ఎకార్ట్‌ తెలిపారు. యూరోపియన్‌ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్యం కుదుర్చుకోవడంతో పాటు సానుకూల పాలసీలు మొదలైన అంశాలు భారత్‌ అధిక వృద్ధి సాధించేందుకు తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు.

 ‘అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ, మిగతా వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత్‌తో పాటు ప్రాంతీయంగా మిగతా దేశాలు పటిష్టమైన వృద్ధి సాధించగలవని భావిస్తున్నాం‘ అని వివరించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగా ఉన్న భారత్‌ వృద్ధి 2026 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతానికి చేరింది. దేశీయంగా డిమాండ్‌ పటిష్టంగా ఉండటం, ఎగుమతులు మెరుగ్గా నమోదు కావడం ఇందుకు తోడ్పడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరపు అంచనాలు అంతకన్నా తక్కువగా 6.6 శాతంగానే ఉన్నప్పటికీ, జనవరిలో వరల్డ్‌ బ్యాంక్‌ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న 6.5 శాతం కన్నా కొంత ఎక్కువే కావడం గమనార్హం. 

వేగవంతమైన వృద్ధి..: ఎగుమతులపై అత్యధిక టారిఫ్‌లను ఎదుర్కొన్నప్పటికీ గతేడాది భారత్‌ అత్యంత వేగవంతంగా వృద్ధి చెందిన ఎకానమీగా నిల్చిందని ఇండియాకి సంబంధించి వరల్డ్‌ బ్యాంక్‌ లీడ్‌ ఎకానమిస్ట్‌ ఆరిలియెన్‌ క్రూస్‌ తెలిపారు. ఆదాయ పన్ను కోతలు, జీఎస్‌టీ రేట్ల తగ్గింపులాంటివి దేశీ వినియోగం పెంచడానికి దోహదపడ్డాయన్నారు. ఇంధన సంక్షోభాన్ని భారత్‌ సమర్ధవంతంగా ఎదుర్కొందని, అయితే రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో రిస్క్ లు తలెత్తే అవకాశం ఉన్నందున వృద్ధిపై ప్రభావం పడొచ్చని క్రూస్‌ పేర్కొన్నారు.

Videos

వాటర్ తో గేమ్స్ వద్దు.. ఒక సెల్ఫీ మూడు ప్రాణాలు

నల్లగా ఉన్నాడని లవర్తో మొగుణ్ణే లేపించేసింది

మోనాలిసాకు బిగ్ షాక్ భర్త ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు

మీ అన్నను చంపించింది నువ్వే అని టాక్... అచ్చెన్నకు గుబాపగిలేలా సజ్జల కౌంటర్

వేసిన 20 రోజులకే ఖతం చేతులతో తవ్వితే ఊడిపోతున్న రోడ్డు

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

చిరు ఆగ్రహం

హరూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త రూల్స్

MAVIGUN పై షర్మిల జోకర్ కామెంట్స్ సజ్జల సెటైర్స్ అదుర్స్

ఎర్రంనాయుడు మరణంలో నీ హస్తం లేదా? అచ్చెన్న పై తమ్మినేని సీతారాం షాకింగ్ నిజాలు

Photos

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)