Breaking News

త్వరలో 25 వేల మందికి ఐటీ మెసేజ్‌లు

Published on Fri, 11/28/2025 - 01:32

న్యూఢిల్లీ: 2025–26 అసెస్‌మెంట్‌ ఇయర్‌కి (ఏవై) గాను దాఖలు చేసిన ఆదాయ పన్ను రిటర్నుల్లో విదేశీ ఆస్తుల వివరాలను వెల్లడించని వారికి ఆదాయ పన్ను శాఖ త్వరలో ఎస్‌ఎంఎస్‌లు/ఈ–మెయిల్స్‌ పంపించనుంది. చట్టపరమైన చర్యలను నివారించేందుకు 2025 డిసెంబర్‌ 31లోగా సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయాలంటూ  తొలి దశలో 25,000 ‘హై–రిస్‌్క’ కేసులుగా పరిగణిస్తున్న వారికి వీటిని పంపించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండో దశలో డిసెంబర్‌ మధ్య నుంచి మిగతా కేసులను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు వివరించాయి. 

ఆటోమేటిక్‌ ఎక్సే్చంజ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఏఈఓఐ) కింద విదేశీ జ్యూరిస్‌డిక్షన్ల నుంచి వచి్చన సమాచారాన్ని బట్టి, విదేశాల్లో ఆస్తులున్నప్పటికీ ఆ వివరాలను వెల్లడించని నిర్దిష్ట ట్యాక్స్‌పేయర్లకు డిపార్ట్‌మెంట్‌ గతేడాది కూడా ఇలాగే ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిళ్లు పంపించింది. దీంతో నోటీసులు వచ్చిన వారు, రాని వారు మొత్తం మీద 24,678 మంది రూ. 29,208 కోట్ల విలువ చేసే విదేశీ అసెట్స్‌ వివరాలను పొందుపరుస్తూ సవరించిన ఐటీఆర్‌లను దాఖలు చేశారు. ఈ ఏడాది జూన్‌ వరకు ఆదాయ పన్ను శాఖ 1,080 కేసులను మదింపు చేసి, రూ. 40,000 కోట్లకు సంబంధించి డిమాండ్‌ నోటీసులు పంపింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే తదితర నగరాల్లో పలు సోదాలు నిర్వహించింది.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)