Breaking News

ఎన్నడూ లేనంత ఆర్థిక అనిశ్చితి

Published on Mon, 05/05/2025 - 11:42

ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) గణనీయంగా తగ్గించేసింది. కరోనా సమయం కంటే అధిక అనిశ్చితి నెలకొన్నట్టు పేర్కొంది. ప్రపంచ జీడీపీ 2025లో 2.8 శాతం, 2026లో 3 శాతం చొప్పున వృద్ధి సాధిస్తుందని తాజాగా అంచనా వేసింది. యూరో ప్రాంతంలో వృద్ధి 2025లో 0.8 శాతం, 2026లో 1.2 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో ఐఎంఎఫ్‌ విడుదల చేసిన గణాంకాలతో పోల్చి చూస్తే ప్రపంచ వృద్ధి అంచనా 0.5 శాతం తగ్గగా, యూరో ప్రాంతం వృద్ధి అంచనా 0.2 శాతం తక్కువ కావడం గమనార్హం. మూడు నెలల క్రితంతో పోలి్చతే మరింత అనిశ్చితుల్లో నేడు ప్రపంచం ఉన్నట్టు ఐఎంఎఫ్‌ తాజా నివేదిక పేర్కొంది.  

టారిఫ్‌లు, అనిశ్చితి..

అమెరికా టారిఫ్‌ విధానాలను ఊహించలేకుండా ఉన్నామని ఐఎంఎఫ్‌ తెలిపింది. 2025 ఏప్రిల్‌ 2 లిబరేషన్‌ డే అన్నది ఆధునిక ప్రపంచంలో అతిపెద్ద టారిఫ్‌ల పెంపుగా నిలిచిపోతుందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టారిఫ్‌ల పెంపునకు 90 రోజుల విరామం ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ.. ఆ తర్వాత పరిస్థితి ఏంటన్న సందేహాన్ని వ్యక్తం చేసింది. వచ్చే డిసెంబర్, రెండేళ్ల తర్వాత పరిస్థితి ఏంటి? చైనా–అమెరికా మధ్య టారిఫ్‌ల పోరు ఎంత కాలం పాటు కొనసాగుతుంది? వీటికి సమాధానాలు ఎవరికీ తెలియవంటూ ఐఎంఎఫ్‌ నిట్టూర్చింది. ఐఎంఎఫ్‌ ప్రపంచ వాణిజ్య అశ్చితి సూచీ 2024 అక్టోబర్‌ నాటితో పోలిస్తే ఏడు రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. ఇది కరోనా విపత్తు నాటితో పోల్చినా గరిష్టానికి చేరింది. టారిఫ్‌ల కారణంగా కంపెనీలు తమ తయారీ చైన్‌ను పునర్‌వ్యవస్థీకరించుకోవాల్సి ఉంటుందని, వినియోగదారులు ప్రత్యామ్నాయ ఉత్పత్తుల వైపు చూడొచ్చని ఐఎంఎఫ్‌ నివేదిక తెలిపింది.  

ఆర్థిక అస్థిరత..

టారిఫ్‌లు, ప్రణాళికలు తరచూ మారిపోతుండడం ఫైనాన్షియల్‌ మార్కెట్లలో పెద్ద ఎత్తున అస్థిరతకు దారితీస్తుందని ఐఎంఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా నాటి స్థాయి అనిశ్చితులను ఫైనాన్షియల్‌ మార్కెట్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ‘ఐదేళ్ల క్రితం అమెరికా రుణ భారంతో అనిశ్చితులు పెరిగాయి. రక్షణాత్మక ధోరణితో ఇన్వెస్టర్లు అధిక రిస్క్‌తో కూడిన సాధనాల్లో (ఈక్విటీ) అమ్మకాలు చేసి, బంగారం, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. ఇప్పుడు దీనికి పూర్తి విరుద్ధమైన పరిస్థితిని చూస్తున్నాం. యూఎస్‌ బాండ్ల ధరలు లిబరేషన్‌ డే నాటి నుంచి తగ్గిపోయాయి. అంటే ఇన్వెస్టర్లు వాటిని విక్రయిస్తున్నారు. అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలను సురక్షిత పెట్టుబడి సాధనంగా మార్కెట్లు భావించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్, అమెరికా రుణానికి ఉన్న పాత్రను దృష్టిలో పెట్టుకుని చూస్తే, భవిష్యత్తులో మరింత ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చు’ అని ఐఎంఎఫ్‌ తెలిపింది.

ఇదీ చదవండి: అనిశ్చితిని ఎలా ఎదుర్కోవాలి?

కరోనా సమయంలో ఉత్పత్తి కార్యకలాపాలను బలవంతంగా నిలిపివేయాల్సి రావడంతో అంతర్జాతీయ సరఫరా వ్యవ­స్థలో అవరోధాలు ఏర్పడగా.. నేడు టారిఫ్‌ల కారణంగా అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినట్లు పేర్కొంది. నేడు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితులకు ఎలాంటి వైరస్‌ కారణం కాదంటూ.. ట్రంప్‌ సలహాదారులు అమెరికా ఆర్థిక ప్రయోజనాల కోణంలో వీటికి కారణమవుతున్నట్టు తెలిపింది.

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు