Breaking News

తాజ్‌ జీవీకేలో ప్రమోటర్ల వాటా అప్‌

Published on Sat, 12/20/2025 - 06:13

న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ టాటా గ్రూప్‌ దిగ్గజం ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ(ఐహెచ్‌సీఎల్‌) భాగస్వామ్య సంస్థ తాజ్‌ జీవీకేలోగల 25.52 శాతం వాటా విక్రయించనుంది. ప్రమోటర్లు జీవీకే–భూపాల్‌ కుటుంబానికి ఈ వాటాను అమ్మివేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఐహెచ్‌సీఎల్‌ వెల్లడించింది. దీంతో ప్రమోటర్లుగా జీవీకే–భూపాల్‌ కుటుంబం తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌లో 74.99 శాతం వాటా పొందనుంది. 

కంపెనీ ఐదేళ్ల ప్రణాళిక(యాక్సెలరేట్‌ 2030)లో భాగంగా అసెట్‌లైట్‌ క్యాపిటల్‌ వ్యూహాలను అమలు చేయనున్నట్లు ఐహెచ్‌సీఎ ల్‌ ఎండీ, సీఈవో పునీత్‌ చత్వాల్‌ పేర్కొ న్నారు. వెరసి జీవీకే–భూపాల్‌ కుటుంబంతో దీర్ఘకాలిక మేనేజ్‌మెంట్‌ కాంట్రాక్టు అమలు చేయనున్నట్లు తెలియజేశారు. 

కాగా.. భవిష్యత్‌ వృద్ధి అవకాశాలలో భాగంగా ఐహెచ్‌సీఎల్‌తో 2025 అక్టోబర్‌లో 256 గదుల తాజ్‌ యెలహంక (బెంగళూ రు) కోసం యాజమాన్య కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నట్లు తాజ్‌ జీవీకే హోటల్స్‌ జేఎండీ కృష్ణ భూపాల్‌ తెలియజేశారు. 2026లో ప్రారంభకానున్న  ఈ హోటల్‌తోపాటు.. తాజ్‌ జీవీకే పోర్ట్‌ఫోలియోలో హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణ, తాజ్‌ డెక్కన్, తాజ్‌ క్లబ్‌హౌస్‌ (చెన్నై), తాజ్‌ చండీగఢ్, వివాంతా హైదరాబాద్‌(బేగంపేట) ఉన్నాయి.  
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)