Breaking News

ద్విచక్ర వాహన విక్రయాలు పెరగొచ్చు.. ఇక్రా అంచనా

Published on Tue, 08/26/2025 - 21:22

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ద్విచక్ర వాహన విక్రయాలు 6–9% పెరగొచ్చని రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనా వేసింది. స్థిరమైన రిప్లేస్‌మెంట్‌(పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం), పట్టణ ప్రాంతాల్లో వినియోగ రికవరీ, సాధారణ వర్షపాతం నమోదుతో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు పెరగడం, జీఎస్‌టీ రేట్ల తగ్గింపు తదితర అంశాలు అమ్మకాల వృద్ధికి తోడ్పడతాయని రేటింగ్‌ సంస్థ తెలిపింది.

‘పరిశ్రమ అవుట్‌లుక్‌ ఇప్పట్టకి సానుకూల వైఖరి కలిగి ఉంది. స్థిరమైన డిమాండ్‌ ఉతమిస్తుంది. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు అంశం వృద్ధి వేగవంతం కావడానికి అదనపు ప్రోత్సాహాన్నిస్తుంది’ అని పేర్కొంది. పండుగ సీజన్‌కు ముందు ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మానుఫ్యాక్చరర్లు (ఓఈఎంలు) డీలర్లకు బలమైన పంపిణీ కారణంగా ఈ జూలైలో టూ వీలర్స్‌ హోల్‌సేల్‌ అమ్మకాలు 9% వృద్ధితో 15 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే జూలైలో రిటైల్‌ అమ్మకాలు 6.5% క్షీణించాయి. పట్టణ ప్రాంతంలో డిమాండ్‌ స్తబ్ధత, అధిక వర్షపాతంతో గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోళ్లు తగ్గడం ఇందుకు కారణమని పేర్కొంది. ఎగుమతుల వృద్ధి సైతం కొనసాగొచ్చని తెలిపింది. రాబోయే పండుగ సీజన్‌ నాటికి రిటైల్‌ డిమాండ్‌ పుంజుకోవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ చెప్పుకొచ్చింది.

ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు?

#

Tags : 1

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి