Breaking News

ఆ ఉద్యోగాలకు ముప్పే.. ఐబీఎం సీఈవో కీలక వ్యాఖ్యలు

Published on Wed, 08/23/2023 - 10:25

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) టూల్స్‌తో కొన్ని రకాల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ఐబీఎం ఛైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణ (Arvind Krishna) అన్నారు. చాట్‌జీపీటీ (ChatGPT), గూగుల్‌ బార్డ్‌ (Google Bard) వంటి జెనరేటివ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ మోడల్స్‌ ఉత్పాదకతను పెంచగలవని, అయితే "బ్యాక్ ఆఫీస్, వైట్ కాలర్" ఉద్యోగాలపై వాటి ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్‌ కృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా పెరుగుదల క్షీణతను ప్రస్తావించారు. ఏఐ టెక్నాలజీలు మానవులకు నాణ్యమైన జీవనాన్ని  అందించడంతో తోడ్పడగలవని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టిఫీషియల్‌ సానుకూలతను ఉపయోగించుకోవడానికి ఐబీఎం కూడా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఐబీఎం ఇటీవల వాట్సన్‌ఎక్స్‌ను అనే జనరేటివ్‌ ఏఐ ప్లాట్‌ఫామ్‌ సూట్‌ను పరిచయం చేసింది. సాంకేతికతను సురక్షితంగా ఉపయోగించుకోవడంలో కంపెనీలకు సహాయం చేయడానికి దీన్ని రూపొందించారు.

 

ఇంతకు ముందు మేనెలలో జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ ఐబీఎం సీఈవో అరవింద్‌ కృష్ణ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ కంపెనీలో 30 శాతం ఉద్యోగాలను ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ లేదా ఆటోమేషన్‌ టెక్నాలజీతో భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఫలితంగా, వచ్చే ఐదేళ్లలో కంపెనీ 7,800 ఉద్యోగాలను తొలగిస్తుందని అంతా ఆందోళన చెందారు. తర్వాత తన వ్యాఖ్యలపై మరింత స్పష్టతనిస్తూ, కొత్త టెక్నాలజీ ఆఫీసు పనిని భర్తీ చేస్తుందని,  ఐబీఎంలో కూడా ఇదే జరుగుతుందని పేర్కొన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)