Breaking News

టెక్ తొలగింపులకు కారణం ఏమిటంటే: ఐబీఎం సీఈఓ

Published on Thu, 12/04/2025 - 21:25

టెక్ పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న తొలగింపులకు ప్రధాన కారణం కృత్రిమ మేధ(ఏఐ) కాదని, కరోనా మహమ్మారి సమయంలో కంపెనీలు అవసరానికి మించి భారీగా ఉద్యోగులను నియమించుకోవడమేనని ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ స్పష్టం చేశారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ఉద్యోగ కోతలను సహజ దిద్దుబాటు(Natural Correction)గా అభివర్ణించారు.

అతిగా నియామకాలు..

1990 నుంచి ఐబీఎంలో వివిధ విభాగాలకు నాయకత్వ పాత్రలు నిర్వహిస్తున్న కృష్ణ 2020 నుంచి 2023 మధ్య చాలా టెక్ కంపెనీలు తమ సిబ్బంది సంఖ్యను 30% నుంచి 100% వరకు వేగంగా పెంచాయని వివరించారు. దాంతో కొంత సహజ దిద్దుబాటు జరగబోతోందని చెప్పారు.

ఈ ఏడాది ఐబీఎం తన ప్రపంచ శ్రామిక శక్తిలో వేలాది ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. ఈ తొలగింపులు ఏఐ కన్సల్టింగ్,  సాఫ్ట్‌వేర్ వంటి వేగంగా వృద్ధి చెందుతున్న రంగాలపై దృష్టి సారించే ప్రయత్నంలో భాగంగా ఉన్నాయని తెలిపింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ తొలగింపులు ఐబీఎం 2,70,000 ప్రపంచ శ్రామిక శక్తిలో సింగిల్ డిజిట్ శాతంగా ఉంటాయని అంచనా వేసింది. కంపెనీ ప్రస్తుతం ఏఐ హైబ్రిడ్ క్లౌడ్ వంటి అధిక లాభదాయకత గల వ్యాపారాలపై పెట్టుబడులను పెంచుతోంది.

ఉద్యోగాలపై ఏఐ ప్రభావం

ఉద్యోగాలపై ఏఐ దీర్ఘకాలిక ప్రభావం గురించి అడిగినప్పుడు, కొంతమేర ఉద్యోగ స్థానభ్రంశం (Job Displacement) ఉంటుందని కృష్ణ అంగీకరించారు. అయితే అది తీవ్రంగా ఉండదని అన్నారు. ‘రాబోయే రెండేళ్లలో మొత్తం యూఎస్‌ ఉపాధి పూల్‌లో 10 శాతం వరకు ఉద్యోగ స్థానభ్రంశం ఉండవచ్చు’ అని అంచనా వేశారు. ఈ ప్రభావం కొన్ని విభాగాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంటుందని పేర్కొన్నారు.

కృత్రిమ మేధ కేవలం ఎంట్రీ లెవల్ శ్రమను తగ్గించడానికి మాత్రమే అనుసరించే విధానం అన్నారు. ఏఐ ఉత్పాదకతను పెంచుతున్నందున కంపెనీలు కొత్త రకాల పాత్రల్లో ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంటాయని కృష్ణ తెలిపారు.

ఇదీ చదవండి: యూఎస్‌లో చదువుకు రూ.10 కోట్లు!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)